బియ్యంలో పురుగులా..? ల‌వంగాల‌తో ల‌క్క పురుగుకు చెక్ పెట్టండిలా..!

బియ్యం ప్ర‌తి ఒక్క‌రి ఇంట్లో ఉంటాయి. అయితే కొంద‌రు ఒక నెల‌కు స‌రిప‌డా బియ్యం తెచ్చుకుంటారు. మ‌రికొంద‌రైతే ఏడాదికి స‌రిప‌డా బియ్యం బ్యాగులు తెచ్చేసుకుంటారు. ఇలాంట‌ప్పుడు బియ్యంలో ల‌క్క పురుగు లేదా న‌లుపు రంగులో ఉండే పురుగులు క‌నిపిస్తుంటాయి.

  • Publish Date - March 21, 2024 / 04:53 AM IST

మ‌నం క‌డుపు నింపుకునేందుకు ఉప‌యోగించే ఆహార ప‌దార్థాల్లో బియ్యం ఒక‌టి. ఈ బియ్యం ప్ర‌తి ఒక్క‌రి ఇంట్లో ఉంటాయి. అయితే కొంద‌రు ఒక నెల‌కు స‌రిప‌డా బియ్యం తెచ్చుకుంటారు. మ‌రికొంద‌రైతే ఏడాదికి స‌రిప‌డా బియ్యం బ్యాగులు తెచ్చేసుకుంటారు. ఇలాంట‌ప్పుడు బియ్యంలో ల‌క్క పురుగు లేదా న‌లుపు రంగులో ఉండే పురుగులు క‌నిపిస్తుంటాయి. ఈ పురుగుల‌ను బియ్యం నుంచి వేరు చేసేందుకు గ్రామాల్లో చేట‌ల్లో వేసుకుని చెరుగుతారు. కానీ ప‌ట్ట‌ణాల్లో ఉండే వారు, ఉద్యోగాల‌తో బిజీగా గ‌డిపేవారికి అంత స‌మ‌యం ఉండ‌దు. కాబ‌ట్టి ఈ పురుగుల‌ను బియ్యం నుంచి వేరు చేసేందుకు కొన్ని చిట్కాలు ఫాలో అయితే స‌రిపోతోంది. పురుగుల్లేని బియ్యంతో అన్నం వండుకొని హాయిగా భోజ‌నం చేయొచ్చు. అప్పుడు మ‌నం కూడా ఆరోగ్యంగా ఉంటాం. మ‌రి ఆ చిట్కాలు ఏంటో చూసేద్దాం..

చిట్కాలు ఇవే..

  • ప్ర‌తి ఒక్క‌రూ బియ్యాన్ని సంచుల్లో నిల్వ చేస్తారు. ఆ సంచుల‌ను ఒక దానిపై ఒక‌టి వేసి ఉంచుతారు. దీంతో స‌హ‌జంగానే బియ్యంలో ల‌క్క పురుగు, న‌లుపు రంగులో ఉండే పురుగులు ద‌ర్శ‌న‌మిస్తుంటాయి. ఈ పురుగుల నివార‌ణ‌కు వేపాకును ఆ సంచుల్లో వేస్తారు. దాంతో పురుగులు మాయ‌మ‌వుతాయి.
  • బియ్యంలో పురుగులు చేర‌కుండా ఉండ‌డానికి మ‌రో అద్భుత‌మైన చిట్కా ఏంటంటే.. బియ్యంలో ల‌వంగాలు, దాల్చిన చెక్క వేసినా కూడా పురుగులు క‌నిపించ‌వు. చాలా మంది గృహిణులు ఈ చిట్కాను ఫాలో అవుతుంటారు. బియ్యం క్వాంటిటీని బ‌ట్టి ఒక నాలుగైదు ల‌వంగాలు, దాల్చిన చెక్క వేస్తే స‌రిపోతోంది.
  • రైస్​లో కొన్ని ఎండు మిరపకాయలు పెట్టడంతో కూడా పురుగులు మాయ‌మ‌వుతాయి. ఈ ఎండుమిర్చి వాసనకు బియ్యానికి పురుగులు పట్టవు. అయితే రెండు వారాలకు ఒకసారి వాటిని మార్చాలి. ఇలా చేయడం ద్వారా మంచి రిజల్ట్ కనిపిస్తుంది.
  • మనం వివిధ వంటకాల్లో స్పైసీ కోసం ఉపయోగించే మిరియాలు కూడా రైస్​ ఎక్కువకాలం నిల్వ ఉంచడానికి ఉపయోగపడాతాయి. మీరు బియ్యం మీద కొన్ని మిరియాలు వేయడం ద్వారా కూడా పురుగు పట్టదు. ఆ వాసన అన్ని కీటకాలనూ పారిపోయేలా చేస్తుంది. ఒకవేళ మీ బియ్యానికి ఇప్పటికే పురుగు పట్టినట్లయితే.. ఆ వాసనకు అవి పారిపోతాయి.
  • వెల్లుల్లి రెబ్బలు బియ్యం సంచుల లోపల పొట్టు తీయకుండా అలాగే ఉంచడం వల్ల అందులోకి పురుగులు రావు.

Latest News