Lunar Eclipse | వందేళ్ల తర్వాత హోలీ రోజునే చంద్రగ్రహణం..! పరిహారాలు పాటించాల్సిందేనా..?

  • Publish Date - March 23, 2024 / 02:33 AM IST

Lunar Eclipse | ఈ ఏడాది హోలీ ఈ నెల 23న జరుగనున్నది. పండుగ రోజున చంద్రగ్రహణం ఏర్పడనున్నది. వంద సంవత్సరాల తర్వాత హోలీ రోజున చంద్రగ్రహణం ఏర్పడుతోందని జ్యోతిష్య పండితులు పేర్కొంటున్నారు. ఇంతకు ముందు 1924 సంవత్సరంలో సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడింది. చంద్రగ్రహణం ఫాల్గుణ మాసం శుక్లపక్షం పౌర్ణమి రోజున సోమవారం ఏర్పడబోతున్నది. ఈ గ్రహణం భారతీయకాలమానం ప్రకారం ఉదయం 10.23 గంటలకు ప్రారంభమై.. మధ్యాహ్నం 3.02 గంటలకు ముగియనున్నది. అయితే, హోలీ రోజున చంద్రగ్రహణం ఏర్పడుతుండడంతో ఎవరికి ఎలాంటి ప్రభావం ఉంటుంది ? ఎలాంటి పరిహారం పాటించాలి ? అనే సందేహాలున్నాయి. అయితే, జ్యోతిష్య పండితులు ఏమంటున్నారంటే..

దాదాపు సంవత్సరాల తర్వాత హోలీ పండగ రోజున చంద్రగ్రహణం ఏర్పడనున్నది. ఈ ఏడాది 2024లో ఏర్పడనున్న తొలి చంద్రగ్రహణం కావడం విశేషం. గ్రహణం సమయంలో రాహువు కన్యరాశిలో ఉండనున్నాడు. అయితే, ఈ గ్రహణం భారతదేశంలో కనిపించడం లేదు. గ్రహణం 4.36 నిమిషాల పాటు కొనసాగుతుంది. ఉత్తర, తూర్పు ఆసియా, యూరప్, ఆస్ట్రేలియా, ఆఫ్రికా, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, పసిఫిక్ మహాసముద్రం, అట్లాంటిక్, ఆర్కిటిక్, అంటార్కిటికాలోని తదితర ప్రాంతాల్లో గ్రహణం కనిపించనున్నది. అయితే, భారతదేశంలో మాత్రం కనిపించే అవకాశం లేదు. అయితే, దేశంలో గ్రహణం కనిపించకపోవడంతో పరిహారం పాటించాల్సిన అవసరం లేదని జ్యోతిష్య పండితులు పేర్కొంటున్నారు. పండగపై గ్రహణం ఎలాంటి ప్రభావం చూపదని చెప్పారు. ఈ విషయంలో ఎలాంటి అపోహలు వద్దని సూచించారు. అయితే, ఈ గ్రహణం కొన్ని రాశులకు శుభప్రదమని తెలిపారు.

Latest News