Site icon vidhaatha

స‌మంత రెండో పెళ్లి చేసుకోదా.. త‌ల్లి కావాల‌నే కోరిక అలా తీర్చుకోనుందా?

టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన స‌మంత ప్ర‌స్తుతం క‌ఠిన ప‌రిస్థితులు ఎదుర్కొంటుంది. నాగ చైత‌న్య‌తో విడాకులు ఆ త‌ర్వాత ఆమె మ‌యోసైటిస్ బారిన ప‌డ‌డం, ఇటీవ‌లి కాలంలో స‌మంత న‌టించిన సినిమాల‌న్ని ఫ్లాప్ కావ‌డం ఆమెని చాలా కుంగ‌దీసాయి. అయితే ప్ర‌స్తుతం త‌న ఆరోగ్యంపై పూర్తి ఫోక‌స్ పెట్టిన స‌మంత సినిమాల‌కి కూడా బ్రేక్ ఇచ్చింది. స‌మంత ఏదైన చాలా విల‌క్ష‌ణంగా ఆలోచిస్తుంది. న‌చ్చిన‌ట్టు చేయాల‌ని అనుకుంటుంది. 14 ఏళ్ల కెరీర్లో సమంత వెనక్కి తిరిగి చూసుకున్న సంద‌ర్భాలు లేవ‌నే చెప్పాలి. ఆమె తొలిసారిగా ఏమాయ చేసావే అనే చిత్రంలో న‌టించింది. ఈ చిత్రం 2010లో విడుదలైంది.

గత రెండేళ్లుగా సమంత వ్యక్తిగత జీవితంలో అనేక ఒడిదుడుకులు ఎదుర‌వుతున్నాయి. ఆమెపై ఎన్నో నిందలు, ఆరోపణలు, సోషల్ మీడియా ట్రోల్స్ ఎంతో జ‌రిగింది. కాని వాట‌న్నింటిని స్ట్రాంగ్‌గా ఎదుర్కొంది. అయితే నాగ చైత‌న్య త‌ర్వాత స‌మంత రెండో పెళ్లి చేసుకుంటుందా అనే ఆలోచ‌న అంద‌రిలో ఉండేది. ఆమె ప్రస్తుత వయసు 36 ఏళ్ళు. వెంటనే పెళ్లి చేసుకోవాల్సిన అవసరం ఉంది. లేదంటే ఏజ్ బార్ అయిపోతే క‌ష్టం. ప్ర‌స్తుతం ఆమెని రెండో పెళ్లి చేసుకోమని స‌ల‌హాలు కూడా ఇస్తున్నార‌ట‌. అయితే సమంతకు మ‌ళ్లీ త‌న జీవితంలో పెళ్లి చేసుకునే ఆలోచన లేదట. ఇకపై ఒంటరిగా ఉండిపోవాలని, మిగిలిన జీవితం నటనకు, సోషల్ వర్క్ కి ఉపయోగించాలని అనుకుంటుంద‌ట‌.

తల్లి కావాలన్న ఆశను వేరే మార్గంలో తీర్చుకోవాల‌ని సామ్ భావిస్తున్న‌ట్టు స‌మాచారం. ఆమె ఇద్దరు పిల్లలను భవిష్యత్ లో దత్తత తీసుకోవాలని వారి ఆల‌నా పాల‌నా చూసుకుంటూ సంతోషంగా జీవించాల‌ని సామ్ ఆలోచ‌న చేస్తుంద‌ట‌. ప్ర‌స్తుతం ఇందుకు సంబంధించిన వార్త నెట్టింట హ‌ల్‌చ‌ల్ చేస్తుంది. కాగా, స‌మంత 2014 నుండి ప్రత్యూష సపోర్ట్ పేరుతో ఓ ఛారిటీ సంస్థ నడుపుతుంది. ఈ సంస్థ తరపున మహిళలు, ఆడపిల్లల సంక్షేమానికి కృషి చేస్తుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.. కాబట్టి సమంత పిల్లలను దత్తత తీసుకుని అమ్మ అవుతారనే వాదన తెరపైకి వచ్చింది. మరోవైపు సమంత కొత్త ప్రాజెక్ట్స్ ఏవీ కూడా ఇంత‌వ‌ర‌కు ప్రకటించలేదు. ఆమె నటించిన సిటాడెల్ వెబ్ సిరీస్ పోస్ట్ ప్రొడక్షన్ జ‌రుపుకుంటుండ‌గా, ఈ యాక్షన్ సిరీస్ వచ్చే ఏడాది ప్రైమ్ లో స్ట్రీమ్ కానుంది.

Exit mobile version