Site icon vidhaatha

హీరోయిన్స్‌తో క‌లిసి రోడ్డు ప‌క్క‌న హీరో చేసిన పనికి.. నెటిజ‌న్ల ప్ర‌శంస‌లు

ఇటీవ‌లి కాలంలో స్టార్స్ త‌మ సినిమా ప్ర‌మోష‌న్స్ కోసం విచిత్రంగా ప్ర‌వ‌ర్తిస్తుండ‌డం అందర‌ని ఆశ్చ‌ర్య‌ప‌రుస్తుంది. సినిమా ప్రమోష‌న్స్‌లో భాగంగా ఏవేవో స్టంట్స్ చేయ‌డం లేదంటే రోడ్డుపై ర‌చ్చ చేయ‌డం, వైవిధ్య‌మైన ప‌నులు చేస్తుండ‌డం అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రుస్తుంది. అయితే తాజాగా ఓ హీరో త‌న ఇద్ద‌రు హీరోయిన్స్‌తో క‌లిసి రోడ్డు ప‌క్క‌న భోజ‌నం చేయ‌డం ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఇలా ఎందుకు చేస్తున్నారు అంటే త‌మ సినిమా ప్ర‌మోష‌న్‌లో భాగంగా చేశార‌ని అర్ధ‌మ‌వుతుంది. వివ‌రాల‌లోకి వెళితే టాలీవుడ్ హీరో సందీప్ కిషన్ ప్రధాన పాత్రలో నటిస్తోన్న సినిమా ‘ఊరు పేరు భైరవకోన’. వీఐ ఆనంద్ దర్శకత్వం వహిస్తోన్న ఈ మూవీలో వర్ష బొల్లమ్మ, కావ్యా థాపర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.

అనిల్ సుంకర సమర్పణలో ఏకే ఎంటర్టైన్మెంట్స్ పై రాజేష్ దండా నిర్మిస్తున్న ఈ చిత్రంకి సంబంధించి గ‌త కొద్ది రోజులుగా ప్ర‌మోష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుగుతున్నాయి. మూవీకి సంబంధించి విడుదలైన సాంగ్స్ సూపర్ హిట్ అయ్యాయి. ఇక ఇటీవల విడుదలైన ఈ మూవీ ట్రైలర్ కూడా మూవీపై మ‌రింత ఆస‌క్తిని పెంచింది. గరుడ పురాణంలో మాయమైన ఆ నాలుగు పేజీలే ఈ భైరవకోన.. భగవంతుడి ఆధీనంలో కూడా లేనిది కర్మ సిద్ధాంతం.. లిఖించబడిందే జరుగుతుంది.. రక్తపాతం జరగనియ్… అంటూ ట్రైలర్ లో వచ్చిన డైలాగ్స్ సినిమాపై మరింత ఆసక్తిని పెంచాయి. దైవభక్తి.. క్షుద్రశక్తితోపాటు కర్మ సిద్ధాంతాన్ని బేస్ చేసుకొని ఈ సినిమాను రూపొందిస్తున్న‌ట్టు స‌మాచారం.

ఫిబ్ర‌వ‌రి 9న ఆడియ‌న్స్‌కి ముందుకు రానున్న భైర‌వ కోన ప్ర‌మోష‌న్స్ శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. అయితే చిత్ర బృందం మూవీకి సంబంధించి విచిత్ర‌మైన ప్ర‌మోష‌న్ కార్య‌క్ర‌మాలు చేప‌డుతుంది. ఈ క్ర‌మంలోనే రోడ్ సైడ్ ఫుడ్ ఆర‌గించారు. హైదరాబాద్‏లోని సాయికుమారి అనే మహిళ కొంతకాలంగా ఫుడ్ బిజినెస్ చేస్తుండ‌గా, ఈమె కన్నా.. నాన్నా.. చిన్నా అంటూ ప్రేమగా మాట్లాడుతూ వెజ్,నాన్‌వెజ్ భోజ‌నం అందిస్తుంది. ఆమె ద‌గ్గ‌ర‌కు వెళ్లిన సందీప్ కిషన్, వర్ష బొలమ్మ, కావ్య థాపర్ అక్కడి భోజనాన్ని తిని ఆస్వాదించారు. అనంతరం ఆమెతో కాసేపు మాట్లాడారు. ఇందుకు సంబంధించిన ఫోటోస్, వీడియోస్ ఇప్పుడు నెట్టింట వైరలవుతున్నాయి. 


Exit mobile version