Site icon vidhaatha

షూటింగ్‌లో సూర్య మీద ప‌డిన కెమెరా.. ఇప్పుడు ఆయ‌న‌కి ఎలా ఉంది ?

ఇటీవ‌ల కాలంలో హీరోలు త‌ర‌చు ప్ర‌మాదాల‌కి గుర‌వుతున్న విష‌యం తెలిసిందే. డూప్‌లు లేకుండా కొంద‌రు రిస్కీ స్టంట్స్ చేస్తున్న స‌మ‌యంలో ప్ర‌మాదానికి గుర‌వుతున్నారు. అయితే తాజాగా త‌మిళ స్టార్ హీరో హీరో కంగువ సినిమా షూటింగ్‌లో గాయ‌ప‌డ్డట్టు తెలుస్తుంది. చిత్రానికి సంబంధించి ఓ స‌న్నివేశం చిత్రీక‌రిస్తున్న‌ప్పుడు రోప్ కెమెరా అదుపుతప్పి సూర్య మీద పడిందట. దీంతో ఆయన భుజానికి గాయమైందని చిత్ర యూనిట్ తెలియ‌జేసింది. ఇక సూర్య‌కి గాయ కావ‌డంతో షూటింగ్‌ని చిత్ర యూనిట్ ర‌ద్దు చేసిన‌ట్టు స‌మాచారం. అయితే సూర్య‌కి పెద్ద ప్ర‌మాద‌మే త‌ప్పింద‌ని, ఆయ‌న తలపై పడి ఉంటే తీవ్రతను ఊహించలేమని యూనిట్ సభ్యులు చెప్పుకొస్తున్నారు.

అయితే సూర్య‌కి ప్ర‌మాదం జ‌రిగింద‌ని తెలిసి ఆయ‌న అభిమానులు, స‌న్నిహితులు కంగారు ప‌డ్డారు. సూర్య ఆరోగ్యం ఎలా ఉందో తెలుసుకోవాల‌ని ప్ర‌య‌త్నిస్తున్నారు. సూర్య గాయం తీవ్రత గురించి పెద్దగా సమాచారం బయటికి రాక‌పోవ‌డంతో. ఆయన భుజానికి ఏమైనా ఫ్యాక్చర్ అయ్యిందా.. లేదంటే చిన్న గాయం అయిందా అని ఫ్యాన్స్ టెన్ష‌న్ ప‌డుతున్నారు. ఈ క్ర‌మంలో సూర్య స్పందిస్తూ.. ‘మిత్రులు, శ్రేయోభిలాషులు , నా ప్రియమైన అభిమానులు అందరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. మీరంతా నేను త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. నేనిప్పుడు బాగానే ఉన్నా, కోలుకుంటున్నా. మీ ప్రేమకి రుణపడి ఉంటా అని త‌న సోష‌ల్ మీడియా పోస్ట్‌లో తెలిపారు.

ఇక ఇదిలా ఉంటే సూర్యకి సంబంధించిన ఫొటో ఒక‌టి ఆ మ‌ధ్య బ‌య‌ట‌కు వ‌చ్చింది. కంగువ’ కోసం సూర్య కొన్ని కిలోల బరువు తగ్గినట్టు సమాచారం. అంతేకాదు, ఈ పీరియాడిక్ డ్రామాలో సూర్య పలు రకాల గెటప్‌లలో కనిపించనున్నారట. సూర్య కెరీర్‌లోనే భారీ బడ్జెట్‌తో ఈ సినిమా రూపొందుతోంది. స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ బ్యానర్లపై కె.ఈ.జ్ఞానవేల్ రాజా, వంశీ, ప్రమోద్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ప్ర‌పంచ వ్యాప్తంగా 38 భాషల్లో ఈ సినిమాను వ‌చ్చే ఏడాది విడుద‌ల చేయాల‌ని ప్లాన్ చేస్తున్నారు. చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తున్నారు. పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాకి సంబంధించి ఇప్పటికే విడుదలైన టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ముఖ్యంగా సినిమాలో సూర్య పోషించిన పాత్ర చిత్రీకరణ కొత్తగా అనిపించింది. ఈ సినిమాతో సూర్య మ‌రో సూప‌ర్ హిట్ ద‌క్కించుకుంటార‌ని అంటున్నారు.

Exit mobile version