Site icon vidhaatha

పోసాని కృష్ణమురళికి బిగ్ రిలీఫ్

Posani Krishna Murali : వైసీపీ నాయకులు.. నటుడు పోసాని కృష్ణమురళికి కోర్టులో బిగ్ రిలీఫ్ దొరికింది. గుంటూరు కోర్టు సీఐడీ కేసులలో బెయిల్ మంజూరు చేసింది. పోసాని 5 కేసుల్లో అరెస్ట్ అవగా అన్ని కేసుల్లోనూ బెయిల్ లభించింది.

గత వైసీపీ ప్రభుత్వంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులలో పోసాని కృష్ణమురళి అరెస్టయ్యారు. ఈ కేసులన్నింటిలోనూ వరుసగా ఒక్కో కోర్టు ఆయనకు బెయిల్ ఇస్తూ వచ్చింది. ఇక పోసాని జైలు నుంచి విడుదల ఖాయమనుకుంటుండగా..అనుహ్యంగా సీఐడీ ఓ పాత కేసులో పీటీ వారెంట్ పై అరెస్టు చేసి మళ్లీ జైలుకే పరిమితం చేసింది.

శుక్రవారం గుంటూరు సీఐడీ కోర్టు ఈ కేసులో విచారణ పూర్తి చేసి తీర్పు ప్రకటించింది. పోసానిపై గతంలో సీఐడీ నమోదు చేసిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఫొటోల మార్ఫింగ్ కేసులో బెయిల్ మంజూరు చేస్తూ తీర్పు ఇచ్చింది. దీంతో పోసాని కృష్ణమురళీకి భారీ ఊరట దక్కినట్లయింది. గతంలో మిగతా కేసుల్లో బెయిల్ పొందిన పోసానికి ఇప్పుడు సీఐడీ కేసులోనూ బెయిల్ లభించడంతో జైలు నుంచి రిలీజ్ అయ్యేందుకు అడ్డంకులు తొలగిపోయాయి.

Exit mobile version