Site icon vidhaatha

Pushpa 2 Showed Nature| షాకింగ్..ప్రకృతి చూపిన పుష్పా 2 సినిమా దృశ్యాలు

విధాత : దేశ వ్యాప్తంగా సినీ ప్రేక్షకులను ఆకట్టుకున్న పుష్ప 2 సినిమా అందరికి తెలిసిందే. ఆ సినిమాలో ఎర్రచందనం దుంగలను స్మగ్లింగ్ చేసే క్రమంలో పోలీసుల నుంచి తప్పించేందుకు వాటిని నదిలో వదిలేసిన సీన్ ప్రేక్షకులకు అద్బుతంగా ఆకట్టుకుంది. అలాంటి సీన్ నిజంగానే ప్రకృతి మనకు కళ్లకు కట్టినట్లుగా చూపించింది. ప్రకృతితో పెట్టుకుంటే పరిణామాలు ఎంత బీభత్సంగా ఉంటాయో చూసేందుకు ఈ హిమాచల్ ప్రదేశ్ లో తాజాగా చోటుచేసుకున్న భారీ వర్షాలు, వరదలు నిదర్శనంగా నిలిచాయి. కులు జిల్లాలోని అడవులు, కొండ ప్రాంతాల నుంచి వచ్చిన వరద పెద్ద ఎత్తున కలప దుంగలను మోసుకుని ఉదృతంగా ప్రవహించింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు పుష్ప 2 సినిమాలోని దృశ్యాలను తలపించాయి.

కులులో జరిగిన ఈ రియల్ సీన్ లో వరద నీరు టన్నుల కొద్దీ కలపను నదిలోకి తీసుకరావడం చూసిన వారంతా అటవీ ప్రాంతాల్ని ఎలా నిర్మూలిస్తున్నారనడానికి ఇదే నిదర్శనమంటూ మండిపడుతున్నారు. ప్రకృతిని ఎంతగా ధ్వంసం చేస్తే..అంతకు ఎన్నో రెట్లు మనల్ని విధ్వంసం చేస్తుందంటూ పర్యావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు.

 

Exit mobile version