Site icon vidhaatha

UBSతో 360 వన్ డబ్ల్యూఏఎం వ్యూహాత్మక భాగస్వామ్యం

ముంబై: స్విట్జర్లాండ్‌లో కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న అంతర్జాతీయ వెల్త్ మేనేజ్‌మెంట్, యూనివర్సల్ బ్యాంకింగ్ దిగ్గజం యూబీఎస్‌తో భారతదేశంలో ప్రముఖ స్వతంత్ర వెల్త్, అసెట్ మేనేజ్‌మెంట్ సంస్థ 360 వన్ డబ్ల్యూఏఎం వ్యూహాత్మక భాగస్వామ్యం కుదుర్చుకుంది. స్థానిక పరిజ్ఞానంతో 360 వన్, అంతర్జాతీయ, ప్రాంతీయ అనుభవంతో యూబీఎస్ కలిసి క్లయింట్లకు అధిక ప్రయోజనాలను అందిస్తాయి. ఈ ఒప్పందం ద్వారా రెండు సంస్థల క్లయింట్లకు ఆన్‌షోర్, ఆఫ్‌షోర్ వెల్త్ మేనేజ్‌మెంట్ సొల్యూషన్స్ అందుబాటులోకి వస్తాయి. అసెట్ మేనేజ్‌మెంట్ ఉత్పత్తులు, ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకింగ్ సేవలలో సహకార అవకాశాలను కూడా పరిశీలిస్తాయి. అదనంగా, 360 వన్ తన అనుబంధ సంస్థల ద్వారా భారతదేశంలో యూబీఎస్ ఆన్‌షోర్ వెల్త్ మేనేజ్‌మెంట్ వ్యాపారాన్ని సొంతం చేసుకోనుంది.

భారతదేశంలో వేగంగా వృద్ధి చెందుతున్న అల్ట్రా-సంపన్న క్లయింట్ల మార్కెట్‌పై నిబద్ధతను సూచిస్తూ, యూబీఎస్ 360 వన్‌లో 4.95% వాటాకు సమానమైన వారంట్లను కొనుగోలు చేస్తుంది. ఈ లావాదేవీ నియంత్రణ అనుమతులపై ఆధారపడి ఉంటుంది. వృద్ధి అవకాశాలను అన్వేషించేందుకు ఇరు సంస్థల సీనియర్ అధికారులతో సంయుక్త కమిటీ ఏర్పాటవుతుంది. క్లయింట్లు, ఉద్యోగులకు అధిక విలువను, సంయుక్త సామర్థ్యాలను వెలికితీసేందుకు ఈ భాగస్వామ్యం బలమైన పునాదిని నిర్మిస్తుంది. “ఈ భాగస్వామ్యం 360 వన్ డబ్ల్యూఏఎం, యూబీఎస్ రెండింటికీ ప్రయోజనకరం. భారతదేశంలో మార్కెట్ నాయకత్వాన్ని బలోపేతం చేయడంతోపాటు, గ్లోబల్ ఇండియన్ క్లయింట్లకు యూబీఎస్ సేవలను విస్తరించడానికి ఇది దోహదపడుతుంది. వ్యక్తిగతీకరించిన, అంతర్జాతీయ స్థాయి వెల్త్ మేనేజ్‌మెంట్ అనుభవాన్ని అందించడంతోపాటు, ఉద్యోగులు, షేర్‌హోల్డర్లకు అధిక విలువను సృష్టిస్తుంది” అని 360 వన్ చైర్మన్ అఖిల్ గుప్తా పేర్కొన్నారు.

మెరుగైన సేవలు…

“ఈ భాగస్వామ్యం సంయుక్త సామర్థ్యాలను వెలికితీసి, క్లయింట్లు, ఉద్యోగులు, షేర్‌హోల్డర్లకు అధిక విలువను అందిస్తుంది. గ్లోబల్ వెల్త్ మ్యాప్‌లో భారతదేశం ప్రాధాన్యతను సూచిస్తూ, స్థానిక పరిజ్ఞానం, గ్లోబల్ అనుభవం కలయికతో వ్యక్తిగతీకరించిన, విశ్వసనీయ, దీర్ఘకాలిక విలువ సృష్టిని అందిస్తుంది,” అని 360 వన్ వ్యవస్థాపకుడు, ఎండీ & సీఈవో కరణ్ భగత్ వివరించారు. “భారతదేశంలో వేగవంతమైన మార్కెట్ వృద్ధిని ఉపయోగించుకుంటూ, 360 వన్‌తో ఈ భాగస్వామ్యం మా కార్యకలాపాలను విస్తరిస్తుంది. గ్లోబల్ ఇండియన్ క్లయింట్లకు దేశీయంగా, అంతర్జాతీయంగా కావలసిన అవకాశాలను అందించడంలో ఇరు సంస్థలు సహకరిస్తాయి” అని యూబీఎస్ గ్లోబల్ వెల్త్ మేనేజ్‌మెంట్ ఏషియా పసిఫిక్ కో-హెడ్ జిన్ యీ యంగ్ తెలిపారు. “360 వన్‌తో ఈ భాగస్వామ్యం సంతోషకరం. స్థానికంగా మెరుగైన సేవలు, ఆన్‌షోర్, ఆఫ్‌షోర్‌లో అత్యుత్తమ వెల్త్ మేనేజ్‌మెంట్ సేవలను అందించడంలో ఇది దోహదపడుతుంది. 360 వన్ బలమైన స్థానిక కార్యకలాపాలు, మా అంతర్జాతీయ ఎన్నారై హబ్‌ల కలయికతో భారతదేశంలోని అత్యుత్తమ సేవలను ప్రపంచానికి, అంతర్జాతీయ సేవలను భారతదేశానికి పరిచయం చేస్తాం” అని యూబీఎస్ ఇండియా కంట్రీ హెడ్ మిహిర్ దోషి పేర్కొన్నారు.

Exit mobile version