Airless Tires | ట్యూబ్‌లెస్ కాదు.. ఎయిర్‌లెస్ టైర్లు రాబోతున్నాయి

భారతయ ఆటో రంగంలో రోజురోజకు వినూత్న మార్పులు చోటుచేసుకుంటున్నాయి. గతంలో ట్యూబ్ టైర్ల నుంచి ట్యూబ్ లెస్ టైర్లకు వచ్చిన మార్పు ఎలా పెద్ద సంచలనం తెచ్చిందో… ఇప్పుడు ఎయిర్‌లెస్ టైర్లు అదే స్థాయి విప్లవానికి నాంది పలుకుతున్నాయి.

భారతయ ఆటో రంగంలో రోజురోజకు వినూత్న మార్పులు చోటుచేసుకుంటున్నాయి. గతంలో ట్యూబ్ టైర్ల నుంచి ట్యూబ్ లెస్ టైర్లకు వచ్చిన మార్పు ఎలా పెద్ద సంచలనం తెచ్చిందో… ఇప్పుడు ఎయిర్‌లెస్ టైర్లు అదే స్థాయి విప్లవానికి నాంది పలుకుతున్నాయి. గాలి లేకుండానే నడిచే ఈ కొత్త తరహా టైర్లపై ఇప్పటికే అంతర్జాతీయంగా భారీ చర్చ సాగుతున్నది. ఈ క్రమంలో భారత మార్కెట్‌కూ ఇవి చేరువలోనే ఉన్నాయనే సంకేతాలు కనిపిస్తున్నాయి. కాగా, గాలిలేని టైర్లు పని తీరు ఎలా ఉంటుంది.. అసలు ఎయిర్ లెస్ టైర్లు అంటే ఏమిటో తెలుసుకుందాం.

ఎయిర్ లెస్ టైర్ల వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. వీటికి గాలి అవసరం లేదు. దీని వల్ల టైర్లలో పదేపదే గాలి నింపించాల్సిన పని ఉండదు. టైరు పగిలిపోతుందనే భయంతో పాటు పంక్చర్ అవుతుందన్న దిగులు ఉండదు. వీటిని తయారు చేయడానికి హై-స్ట్రెంగ్త్ రబ్బరు స్పోక్‌లు, ఫ్లెక్సిబుల్ పాలిమర్ బెల్ట్‌లు, సాలిడ్ రబ్బరు లేయర్లు వినియోగిస్తారు. దీని వల్ల టైర్‌కు అవసరమైన ఆకారం, బలం, సస్పెన్షన్ ఇవ్వడం వల్ల పంక్చర్ అవ్వడం, పేలిపోవడం, గాలి తగ్గడం వంటి సమస్యలు పూర్తిగా ఉండవు. రాళ్లు, మేకులు, గాజు ముక్కలు… ఏవి తగిలినా టైర్ తన ఆకారాన్ని మార్చుకుని షాక్‌ను అప్‌సోర్బ్ చేస్తుంది. గాలి లేకపోవడంతో ‘బ్లోఅవుట్’ ప్రమాదం కూడా ఉండదు. ఇదే ఈ టెక్నాలజీకి పెద్ద ప్లస్.

గాలిలేని టైర్లలో లోపలి స్పోక్స్ నిర్మాణం బయట నుంచి కనిపించేలా ఉంటుంది. ఇది కేవలం లుక్స్ కే కాకుండా హీట్ అబ్జర్వేషన్, ఫ్లెక్సిబిలిటీ, షాక్ అబ్జార్వ్షన్ కు ప్రయోజనకరంగా ఉంటుంది. అలాగే, ఈ టైర్లను పదేపదే మార్చాల్సిన అవసరం ఉండదు, నిర్వహణ ఖర్చు కూడా ఉండదు. ప్రస్తుతం లభ్యమయ్యే అంతర్జాతీయ మోడళ్ల ఆధారంగా ధరలు అధికంగా ఉంటాయని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఎయిర్ లెస్ టైర్లు రూ.10వేల నుంచి 20వేల మధ్య ఉంటుందట. కామన్ ట్యూబ్‌లెస్ టైర్ల ధర రూ. 1500 నుంచి 7000 మాత్రమే ఉంటుందని నివేదికలు చెబుతున్నాయి. కాగా, ప్రస్తుతం ఉన్న ట్యూబ్ లెస్ టైర్ల కంటే వీటి రేట్లు అధికంగా ఉంటాయని స్పష్టమవుతోంది.

Latest News