Bank Holidays in August | ఒక రోజైతే జులై నెల( July Month ) ముగుస్తుంది. శుక్రవారం నుంచి ఆగస్టు మాసం( August Month ) ప్రారంభం కాబోతుంది. ఇక కొత్త నెల వస్తుందంటే చాలు.. ఖాతాదారులు బ్యాంకుల సెలవుల( Bank Holidays ) గురించి ఆరా తీస్తుంటారు. ఎందుకంటే.. ముఖ్యమైన తమ ఆర్థిక లావాదేవీలను( Financial Transactions ) సరి చేసుకునేందుకు. అన్ని బ్యాంకుల సర్వీసులు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉన్నప్పటికీ.. కొన్ని లావాదేవీలకు తప్పకుండా బ్యాంకులకు వెళ్లక తప్పదు. కాబట్టి ఆగస్టు నెలలో బ్యాంకులకు ఎన్ని రోజులు సెలవులు వచ్చాయో తెలుసుకుందాం.
రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా( Reserve Bank of India ) విడుదల చేసిన సెలవుల క్యాలెండర్ ప్రకారం.. ఆగస్టు నెలలో వివిధ రాష్ట్రాల్లో పండుగలు, వీకెండ్ హాలిడేస్ పరిగణనలోకి తీసుకుంటే మొత్తం 15 రోజులు బ్యాంకులు బంద్ ఉండనున్నాయి. అయితే రాష్ట్రాలను బట్టి సెలవు దినాల్లో వ్యత్యాసం ఉంటుంది. ఇందులో పంద్రాగస్టు( Independence Day ), వినాయక చవితి( Vinayaka Chavithi ), శ్రీకృష్ణాజన్మాష్టమి, రాఖీ పండుగ( Rakhi Festival )తో పాటు పలు రాష్ట్రాల పండుగలు, శని, ఆదివారాల సెలవులు కూడా ఉన్నాయి.
ఆగస్టు నెలలో బ్యాంకులకు సెలవులు ఇలా..
ఆగస్టు 3 – ఆదివారం సెలవు
ఆగస్టు 8 – ఒడిశా, సిక్కింలో టెండంగ్ లో రుమ్ ఫాట్ కారణంగా మూసివేత
ఆగస్టు 9 – రాఖీ పండుగ
ఆగస్టు 10 – ఆదివారం సెలవు
ఆగస్టు 13 – ఇంఫాల్ (మణిపూర్) లో బ్యాంకులు మూసివేస్తారు
ఆగస్టు 15 – పంద్రాగస్టు
ఆగస్టు 16 – శ్రీకృష్ణజన్మాష్టమి
ఆగస్టు 17 – ఆదివారం సెలవు
ఆగస్టు 19 – మహారాజా వీర్ విక్రమ్ కిషోర్ మాణిక్య బహదూర్ జయంతి, త్రిపురలో బ్యాంకులకు సెలవు
ఆగస్టు 23 – 4వ శనివారం సెలవు కారణంగా బ్యాంకులకు సెలవు
ఆగస్టు 24 – ఆదివారం సెలవు
ఆగస్టు 25 – శ్రీమంత శంకరదేవ్ తిరుభావ తిథి కారణంగా గౌహతి (అస్సాం) లో బ్యాంకులు మూసివేత
ఆగస్టు 27 – వినాయక చవితి
ఆగస్టు 28 – నువాఖై రెండవ రోజున భువనేశ్వర్ (ఒడిశా), పనాజీ (గోవా) లలో బ్యాంకులకు సెలవు
ఆగస్టు 31 – ఆదివారం సెలవు కారణంగా దేశ వ్యాప్తంగా బ్యాంకులు బంద్
