Site icon vidhaatha

Nita Ambani | నీతా అంబానీ చేతిలోని ఆ దీపం వెనుక రహస్యం మీకు తెలుసా..?

Nita Ambani : రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముకేశ్‌ అంబానీ, రిలయన్స్‌ ఫౌండేషన్‌ చైర్‌పర్సన్‌ నీతా అంబానీల చిన్న కుమారుడు అనంత్ అంబానీ వివాహం ఘనంగా జరిగింది. కుటుంబసభ్యులు, బంధుమిత్రులు, సినీ, క్రీడా, రాజకీయ రంగ ప్రముఖుల సమక్షంలో అనంత్‌ అంబానీ.. రాధిక మర్చంట్‌ మెడలో మూడు ముళ్లు వేశారు. ఈ సందర్భంగా ముకేశ్‌ అంబానీ దంపతులు సహా అతిథులందరూ డీజే పాటలకు అనుగుణంగా డ్యాన్స్‌లు ఆడుతూ ఎంజాయ్‌ చేశారు.

ఈ పెళ్లికి సంబంధించిన వీడియోలు ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ పెళ్లిలో బాలీవుడ్, టాలీవుడ్, హాలీవుడ్, కోలీవుడ్ ఇలా అన్ని సినిమా ఇండస్ట్రీలకు సంబంధించిన స్టార్ హీరో హీరోయిన్లు హాజరై డ్యాన్సులతో అదరగొట్టారు. అయితే అలాంటి అనంత్ అంబానీ రాధిక మర్చంట్ల పెళ్ళిలో ప్రతి ఒక్కటి సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గానే మారింది. వాళ్లు వేసుకున్న డ్రెస్సులు మొదలు నెక్లెస్‌లు, వేలి ఉంగరాలు ఇలా ప్రతి ఒక్కటి వైరల్‌గా మారుతున్నాయి.

ఈ పెళ్లిలో నీతా అంబానీ ఒక దీపం పట్టుకొని నడుచుకుంటూ వస్తూ ఉంటే ఆమె వెనుకాలే ముకేశ్‌ అంబానీ, అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ వచ్చారు. అయితే ఆ దీపానికి వినాయకుడి ప్రతిమ కూడా ఉంది. ఆ వీడియో నెట్టింట్లో వైరల్ అవ్వడంతో అసలు నీతా అంబానీ అలా దీపం పట్టుకొని ఎందుకు వచ్చింది..? ఆమె వెనుకాలే ముకేశ్ అంబానీ, కొత్త దంపతులు ఎందుకు నడిచారు..? అనే ప్రశ్నలు వీడియో చూసిన ప్రతి ఒక్కరి మదిలో మెదులుతున్నాయి. మరి నీతా అంబానీ అలా గణపతి ప్రతిమ ఉన్న దీపాన్ని పట్టుకొని రావడానికి ప్రధాన కారణం ఉన్నది.

నీతా అంబానీ తన చేతిలో పట్టుకున్న గణపతి చిహ్నం ఉన్న దీపాన్ని రామన్ దివో అంటారట. ఆ దీపానికి గుజరాతి పెళ్లిళ్లలో ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. గుజరాతీలు పెళ్లి చేసుకున్న సమయంలో ఇంటి పెద్ద దంపతులు జంటను ఇలా దీపం వెలిగించుకొని ముందుకు నడిపించుకుంటూ వస్తూ ఉంటే ఆ వెనకాలే కొత్త దంపతులు రావాలి. అయితే ఈ రామన్ దివోని గుజరాతి పెళ్లిళ్లలో శుభప్రదంగా భావిస్తారు. అప్పుడే పెళ్లి చేసుకున్న కొత్తజంట జీవితంలో చీకట్లు తొలగిపోయి అంతా శుభమే జరుతుందని విశ్వాసం. అందుకే నీతా అలా దీపాన్ని తీసుకొచ్చారట.

Exit mobile version