విధాత : బంగారం కొనుగోలు చేయబోతున్న మహిళలకు గుడ్ న్యూస్ వచ్చింది. వరుసగా మరోసారి బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. సోమవారం హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,140 తగ్గి రూ.1,24,480 వద్ద కొనసాగుతుంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,050 తగ్గి..రూ.1,14,100గా నమోదైంది. వెండి ధర మాత్రం క్రితం రోజు ధర కిలో రూ. 1,70,000వద్దనే కొనసాగుతుంది.
అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు కుప్పకూలుతున్నాయి. డాలర్ పుంజుకోవడం, ఇన్వెస్టర్లు లాభాలకు ప్రయత్నించడంతో బంగారం ధరలు దిగివస్తున్నాయి. భారత్ సహా వివిధ దేశాలకు సంబంధించిన టారిఫ్‌ల విషయంలో అమెరికా సానుకూలంగా స్పందించవచ్చన్న సంకేతాలు కూడా బంగారం రేట్లు పడిపోయేందుకు కారణమని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
