New Sim Card Rules | సిమ్‌కార్డ్‌ కొత్త రూల్స్‌.. అతిక్రమిస్తే రూ.2లక్షల జరిమానా తప్పదు..!

New Sim Card Rules | స్మార్ట్‌ఫోన్‌ మన జీవితంలో ముఖ్యమైన భాగంగా మారింది. ఫోన్‌లో చేతిలో లేనిరోజును ఊహించలేని పరిస్థితి. సిమ్‌కార్డ్‌ లేకుండా ఫోన్‌ అసంపూర్ణంగానే ఉంటుంది. ఈ క్రమంలో టెలికాం పరిశ్రమలోనే నేటి నుంచి మార్పులు జరుగబోతున్నాయి.

  • Publish Date - July 1, 2024 / 11:00 AM IST

New Sim Card Rules | స్మార్ట్‌ఫోన్‌ మన జీవితంలో ముఖ్యమైన భాగంగా మారింది. ఫోన్‌లో చేతిలో లేనిరోజును ఊహించలేని పరిస్థితి. సిమ్‌కార్డ్‌ లేకుండా ఫోన్‌ అసంపూర్ణంగానే ఉంటుంది. ఈ క్రమంలో టెలికాం పరిశ్రమలోనే నేటి నుంచి మార్పులు జరుగబోతున్నాయి. అయితే, ప్రస్తుతకాలంలో టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతున్నది. ఈ క్రమంలో నేరాలు సైతం పెరుగుతున్నాయి. ఎన్నిరకాల చర్యలు తీసుకున్నా సైబర్‌ నేరాలు మాత్రం తగ్గడం లేదు. వీటికి అడ్డుకట్ట వేసేందుకు డాట్‌ (DoT) కీలక నిర్ణయం తీసుకున్నది. టెలికాం చట్టం తాజాగా అమలులోకి వచ్చింది.

డాట్‌ నిబంధనల ప్రకారం.. ఒక వ్యక్తి తన ఆధార్‌కార్డుపై కేవలం తొమ్మిది సిమ్‌లను మాత్రమే కొనుగోలు చేసేందుకు వీలుంటుంది. తొమ్మిది కంటే ఎక్కువ సిమ్‌కార్డులను కలిగి ఉంటే.. నిబంధనలు ఉల్లంఘించినట్లే. రూల్స్ అతిక్రమించినందుకు మొదటి తప్పుగా రూ.50వేల జరిమానా విధిస్తారు. పదేపదే రూల్స్‌ అతికమ్రిస్తే రూ.2లక్షల జరిమానా విధించనున్నారు. అక్రమ మార్గాల్లో సిమ్‌కార్డు తీసుకున్నటయితే రూ.50లక్షల జరిమానాతోపాటు మూడేళ్ల శిక్ష విధించే అవకాశం సైతం ఉంటుంది. ఈ పరిస్థితుల్లో మీ ఆధార్‌తో ఎన్ని సిమ్‌లు లింక్‌ అయ్యాయి తెలుసుకోవడం ముఖ్యం. లింక్‌ అయిన సిమ్‌లో ఉపయోగిస్తున్న దాన్ని మినహా మిగతా వాటిని డిస్‌కనెక్ట్‌ చేసే వీలుంటుంది.

ఆధార్‌ ఎన్ని కార్డులు లింక్‌ అయ్యాయో తెలుసుకోండి ఇలా..

మీ ఆధార్‌ కార్డుతో ఎన్ని సిమ్‌లు లింక్‌ అయ్యాయో.. ఎలా అన్‌లింక్‌ చేయాలో తెలుసుకునేందుకు అవకాశం ఉంది. ఎక్కడికి వెళ్లేందుకు అవసరం లేకుండా DoT కొత్త వెబ్‌సైట్ ద్వారా సెకన్లలోనే పనిని పూర్తి చేసుకోవచ్చు. డీఓటీ ఇటీవల సంచార్‌ సాహితీ అనే వెబ్‌పోర్ట్‌ను ప్రారంభించింది. దాంతో వినియోగదారులు తమ ఆధార్‌తో లింక్‌ చేసిన అన్ని ఫోన్‌ నంబర్లను తనిఖీ చేసేందుకు వీలు కల్పిస్తుంది.

ఆధార్‌తో ఎన్ని మొబైల్‌ నంబర్స్‌ రిజస్టర్‌ అయ్యాయో తనిఖీ చేయండిలా..

మొదట Sancharsathi.gov.in పోర్టల్‌ని సందర్శించాలి. ఆ తర్వాత మొబైల్‌ కనెక్షన్‌ సెలక్షన్‌పై క్లిక్‌ చేయాలి. ఆ తర్వాత సంప్రదింపు నంబర్‌ను నమోదు చేయాలి. ఆ తర్వాత రిజస్టర్డ్‌ మొబైల్‌ నంబర్‌కు ఓటీపీ వస్తుంది. ఆ తర్వాత ఆధార్‌ నంబర్‌కు లింక్‌ చేసిన అన్ని నంబర్‌లు వెబ్‌సైట్‌లో కనిపిస్తాయి. మీరు ఉపయోగింయని.. అవసరం లేని నంబర్‌లపై రిపోర్ట్‌, బ్లాక్‌ చేయవచ్చు.

Latest News