విధాత : అందాల ముద్దుగుమ్మ.. మిస్ ప్రెష్ ఫేస్ అషికా రంగానాథ్(Ashika Ranganath) బర్త్ డే సందర్భంగా ఆమె అభిమానుల నుంచి సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. 1996 ఆగస్టు 5న జన్మించిన కన్నడ భామ అషికా రంగనాథ్ ప్రస్తుతం బింబిసార మూవీ దర్శకుడు వశిష్ట దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి(Mega Star Chiranjeevi) హీరోగా రూపుద్దిద్దుకుంటున్న సోషియో ఫాంటసీ మూవీ విశ్వంభరలో(Vishwambhara) హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమా విజయంపై అషికా ఎన్నో ఆశలు పెట్టుకుంది. ఇదే సినిమాలో మరో హిరోయిన్ గా సీనియర్ నటి త్రిషా కూడా నటిస్తుంది. నందమూరి కల్యాణ్ రామ్ సరసన అమిగోస్ మూవీతో తెలుగు సినిమా ఎంట్రీ ఇచ్చిన అషికా రంగనాథ్ సీనియర్ హీరో నాగార్జన్ సరసన నాసామి రంగతో తెలుగు ప్రేక్షకులను మెప్పించింది. తదుపరి యువ హీరోలతో కాకుండా మరో సీనియర్ హీరో చిరంజీవి పక్కన నటించడం అషికా ప్రత్యేకతగా చెప్పవచ్చు.
ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న విశ్వంభర విడుదల తేదీని చిరంజీవి పుట్టినరోజు అయిన ఆగస్టు 22 సందర్భంగా చిత్ర బృందం ప్రకటించే అవకాశముంది. బహుశా దసరా సందర్భంగా సెప్టెంబర్ 18న సినిమా విడుదల చేసే అవకాశముంది. చిరంజీవి కెరీర్ లోనే అత్యంత ఖరీదైన చిత్రంగా విశ్వంభర తెరకెక్కుతుంది.