Naga Chaitanya- Sobhita|కౌంట్ డౌన్ స్టార్ట్ అంటూ నాగ చైతన్య-శోభితల పెళ్లి గురించి అప్‌డేట్ ఇచ్చిన సమంత
Naga Chaitanya- Sobhita|సమంతతో విడాకుల తర్వాత సింగిల్ లైఫ్ లీడ్ చేసిన నాగచైతన్య శోభితో ఓ రెస్టారెంట్‌లో కనిపించి సమ్ థింగ్ థింగ్ న్యూస్‌తో.. ఓవర్ నైట్ హాట్ టాపిక్ అయ్యాడు.అప్పటి నుండి ఈ ఇద్దరి మధ్య ఏదో నడుస్తుందని అనేక ప్రచారాలు జరిగాయి. ఆ ప్రచారాల నడుమ ఆగస్ట్ 8న చైతూ,శోభితలు నిశ్చితార్థం జరుపుకున్నారు.ఇక పెళ్లి ఎప్పుడు చేసుకుంటారా అని డిస్కషన్ నడుస్తున్న సమయంలో డిసెంబర్ 4న ఈ యువ జంట పె

Naga Chaitanya- Sobhita|సమంతతో విడాకుల తర్వాత సింగిల్ లైఫ్ లీడ్ చేసిన నాగచైతన్య శోభితో ఓ రెస్టారెంట్‌లో కనిపించి సమ్ థింగ్ థింగ్ న్యూస్‌తో.. ఓవర్ నైట్ హాట్ టాపిక్ అయ్యాడు.అప్పటి నుండి ఈ ఇద్దరి మధ్య ఏదో నడుస్తుందని అనేక ప్రచారాలు జరిగాయి. ఆ ప్రచారాల నడుమ ఆగస్ట్ 8న చైతూ,శోభితలు నిశ్చితార్థం జరుపుకున్నారు.ఇక పెళ్లి ఎప్పుడు చేసుకుంటారా అని డిస్కషన్ నడుస్తున్న సమయంలో డిసెంబర్ 4న ఈ యువ జంట పెళ్లితో ఒకటి కానున్నారని అంటున్నారు. ఎక్కడో కాకుండా హైదరాబాద్ లోనే రెండు కుటుంబాలు ఈ పెళ్లి చేయాలని డిసైడ్ అయ్యారట. చాలా సింపుల్ గా కేవలం లిమిటెడ్ కుటుంబీకులు అతిథులు సమక్షంలో ఈ పెళ్లి చేయాలని ఫిక్స్ చేశారట. సో మొత్తానికి ఇలా ఈ యువ జంట పెళ్ళికి సన్నాహాలు జరుగుతున్నాయి అని చెప్పాలి.
అటు శోభిత ఇంట్లోనూ ఇప్పటికే పెళ్లి పనులు ప్రారంభమయ్యాయి. గోధుమ రాయి, పసుపు దంచడం వంటి ప్రీ వెడ్డింగ్ కార్యక్రమాలు పూర్తయ్యాయని ఇటీవలే శోభిత కొన్ని ఫొటోలు పోస్ట్ చేసింది. అవి నెట్టింట తెగ వైరల్ అయ్యాయి. తాజాగా శోభిత సోదరి సమంత ధూళిపాళ్ల మరికొన్నిఫొటోలను పంచుకుంది. పెళ్లికి కౌంట్‌డౌన్ స్టార్ట్ అంటూ తన ఫ్యామిలీ పిక్స్‌ను పంచుకుంది.ఇందులో తనతో పాటు శోభత, తల్లిదండ్రులు కూడా ఉన్నారు. శోభిత పూజారి ఆశీర్వాదం తీసుకున్నట్టుగా కూడా ఉంది. చూస్తుంటే వచ్చే నెలలోనే చైతూ-శోభితలు అన్నపూర్ణ స్టూడియోలో వివాహం చేసుకోవడం ఖాయంగా కనిపిస్తుంది.
ఇక వారి కెరీర్ విషయానికి వస్తే.. నాగ చైతన్య తన కెరీర్ లో భారీ సినిమా “తండేల్ చిత్రంతో బిజీగా ఉండగా శోభిత కూడా తెలుగు సహా హిందీ సినిమాలు ఇంకా వెబ్ సిరీస్ లు చేస్తుంది. అలాగే చై తండేల్ సినిమా వచ్చే ఏడాది రిలీజ్ కానుంది. ఫిబ్రవరి 7న రిలీజ్ చేయబోతున్నట్టు అఫీషియల్‌గా ప్రకటించారు. లవ్ స్టోరీ చిత్రం తర్వాత సాయి పల్లవి, నాగ చైతన్య కలిసి పని చేస్తున్న చిత్రం తండేల్ మూవీ కాగా, ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.