Rao Bahadur | విధాత : ప్రేక్షకులను విభిన్న పాత్రలతో మెప్పిస్తున్న నటుడు సత్యదేవ్(Satyadev) మరోసారి సరికొత్త పాత్రలో అలరించేందుకు సిద్దమయ్యారు. ఇటీవల కింగ్డమ్(Kingdom) చిత్రంలో విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) అన్నగా నటించి మెప్పించిన సత్యదేవ్ ఈసారి తనను కనీసం పోల్చుకోలేని రీతిలో విభిన్న వేషధారణతో కూడిన రావు బహదూర్(Rao Bahadur) అనే పాత్రలో కనిపించబోతున్నారు. ఉమా మహేశ్వర ఉగ్ర రూపస్య, కేరాఫ్ కంచరపాలెం సినిమాల దర్శకుడి వెంకటేశ్ మహా(Venkatesh Maha) దర్శకత్వంలో వస్తున్న రావు బహదూర్ అనే సినిమాలో సత్యదేవ్ హీరోగా నటిస్తున్నారు. ఈ మూవీ నుంచి మేకర్స్ ఫస్ట్ లుక్ విడుదల చేశారు.
అందులో రావు బహదూర్ పాత్రలో గుర్తు పట్టలేని రీతిలో సత్యదేవ్(Stayadev) ఇమిడిపోయారు. వృద్ధ జమిందారీ పాత్రలో సత్యదేవ్ అందరిని విస్మయపరిచాడు. అనుమానం పెనుభూతం క్యాప్షన్ తో ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఐదేళ్లుగా నా మదిలో మెదలుతున్న వ్యక్తి సత్యదేవ్ ను రావు బహాదూర్ గా మీ ముందుకు తెస్తున్నామంటూ దర్శకుడు వెంకటేష్ మహా తన ఎక్స్ ఖాతాలో తెలిపారు. 2026 వేసవిలో ఈ చిత్రం థియేటర్లలోకి రానుందని వెల్లడించారు. సూపర్ స్టార్ మహేశ్ బాబు(Mahesh Babu) నిర్మాణ సంస్థ జీఎమ్బీ(GMB) ఎంటర్ టైన్‌మెంట్ సమర్పిస్తున్న రావు బహాదూర్ సినిమాను శ్రీచక్రాస్ ఎంటర్ టైన్‌మెంట్స్, అప్లాజ్ మూవీస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
ఇవి కూడా చదవండి…
టెలికాం భద్రతలో విప్లవం – పోగొట్టుకున్న 5.35 లక్షల ఫోన్ల రికవరీ
ఎయిమ్స్‌లో కొలువుల జాతర.. 3500 నర్సింగ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల