Site icon vidhaatha

నకిలీ చలాన్ల స్కాం.. 48 గంటల్లో రూ.1.02 కోట్లు రికవరీ

విధాత‌: కృష్ణా జిల్లా మండవల్లి సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో జరిగిన నకిలీ చలానాల వ్యవహారంలో ప్రధాన నిందితుడైన స్టాంప్‌ వెండర్‌ దీరజ్‌ను అరెస్టు చేసినట్టు జిల్లా ఎస్పీ సిద్దార్థ్‌ కౌశల్‌ తెలిపారు. కృష్ణా జిల్లా కైకలూరు టౌన్‌ పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేసు వివరాలు వెల్లడించారు. కేవలం 48గంటల్లో 640 నకిలీ చలానాలలో 450 చలానాలకు సంబంధించి రూ.1.02 కోట్ల నగదు ప్రభుత్వ ఖజానాలో జమ చేయించామని తెలిపారు. నకిలీ చలానాలతో రిజిస్ట్రేషన్‌ చేయించుకున్న బాధితులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, దర్యాప్తు కొనసాగుతోందని ఎస్పీ తెలిపారు. ఈ వ్యవహారంలో నిందితులు ఎంత పెద్ద స్థాయిలో ఉన్నా వారిని గుర్తించి చట్టపరమైన, శాఖపరమైన చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. నిందితుల వద్ద నుంచి వందశాతం నగదు రికవరీ చేస్తామన్నారు.

Exit mobile version