హైదరాబాద్, సెప్టెంబర్ 28(విధాత): చత్తీస్‌గఢ్ కాంకేర్ జిల్లాలో భద్రతా బలగాలు, మావోయిస్టులకు మధ్య కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందినట్లు పోలీసులు వెల్లడించారు. కాంకేర్, గరియాబంద్ జిల్లాల సరిహద్దులోని రావస్ అటవీ ప్రాంతంలో మావోయిస్టులు ఉన్నారన్న సమాచారం అందడతో డీఆర్‌జీ బలగాలు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టాయి. ఈ క్రమంలో మావోయిస్టులు, భద్రతా బలగాల మధ్య భీకర కాల్పులు జరిగినట్లు ఆ జిల్లా ఎస్పీ తెలిపారు. ఘటనా స్థలం వద్ద ముగ్గురు మావోయిస్టుల మృతదేహాలు, ఆయుధాలు స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. మృతి చెందిన వారిలో ఓ మహిళా, ఏరియా కమిటీ సభ్యలు కూడా ఉన్నట్లు గుర్తించామన్నారు. ఇప్పుడు జరిగిన ఎన్‌కౌంటర్‌తో కలిపి చత్తీస్‌గఢ్‌లో జరిగిన వేర్వేరు కాల్పుల్లో 252 మంది మావోలు హతమయ్యారని పేర్కొన్నారు.
కాంకేర్ జిల్లాలో ఎన్‌కౌంటర్.. ముగ్గురు మావోయిస్టులు హతం
చత్తీస్‌గఢ్ కాంకేర్ జిల్లాలో భద్రతా బలగాలు, మావోయిస్టులకు మధ్య కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందినట్లు పోలీసులు వెల్లడించారు

Latest News
స్పీకర్ ప్రసాద్ కు సుప్రీంకోర్టు కోర్టు ధిక్కరణ నోటీసులు
మున్సిపల్ ఎన్నికలకు ఇన్చార్జ్లుగా మంత్రులు
డిప్రెషన్తో బాధపడుతున్నారా..? ఈ సమస్యకు వ్యాయామంతో చెక్ పెట్టండి
దుమ్ము.. దుమ్ము అయిపోతావ్ : సీఎం రేవంత్ రెడ్డికి హరీష్ రావు వార్నింగ్
తెలుగు శబ్ధమే అతి ప్రాచీనమైనది
గ్రీన్ ల్యాండ్ స్వాధీనానికి టైమ్ వచ్చేసింది: ట్రంప్ సంచలన పోస్టు
రూ.7 చోరీ కేసు.. 50 ఏళ్ల తర్వాత తుది తీర్పు.. ఇప్పటికీ దొరకని దొంగల ఆచూకీ..!
మూడు లగ్జరీ ఇళ్లు, కారు, వడ్డీ వ్యాపారాలు.. రూ.కోట్లకు పడగలెత్తిన బిచ్చగాడు.. విలాసాలు చూస్తే షాకే
వెండి ధర కొత్త రికార్డు..పెరిగిన బంగారం ధరలు
సంక్రాంతి 2026 బాక్సాఫీస్ విజేతలు యువ హీరోలే..