Site icon vidhaatha

Crime News : స్వాతి శరీర భాగాల కోసం మూసీలో గాలింపు

Mahendar reddy and Swati

Crime News | మేడ్చల్ జిల్లా బోడుప్పల్ లో హత్యకు గురైన స్వాతి శరీర భాగాల కోసం మూసీ నదిలో డీఆర్ఎఫ్ సిబ్బంది సోమవారం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ నెల 24న మూసీలో 10 కి.మీ. దూరం స్వాతి శరీర భాగాల కోసం వెతికారు. సోమవారం కూడా మూసీలో బోట్ల సహాయంతో గాలిస్తున్నారు. ఈ నెల 23 రాత్రి స్వాతిని ఆమె భర్త మహేందర్ రెడ్డి హత్య చేశారు. డెడ్ బాడీని ముక్కలు ముక్కలుగా వేరు చేశారు. విడతల వారీగా ప్లాస్టిక్ కవర్లో చుట్టి ఈ శరీర భాగాలను మూసీ నదిలో పారేశాడు. స్వాతి మొండం ఒక్కటి మాత్రమే మిగిలింది. ఈ మొండానికి డీఎన్ఏ పరీక్షలు నిర్వహించి ఇది స్వాతి డెడ్ బాడీ అవునో కాదో నిర్ధారించాలని పోలీసులు భావిస్తున్నారు. మరో వైపు మూసీలో పారేసిన శరీర భాగాల కోసం గాలిస్తున్నారు. ఇటీవల కురిసిన వర్షాలతో పాటు హిమాయత్ సాగర్ గేట్లు ఎత్తడంతో మూసీకి వరద పోటెత్తింది. మూసీలో ఇంకా వరద ఉధృతంగా ఉంది. దీంతో మూసీలో వేసిన శరీర భాగాలు చాలా దూరం వరకు కొట్టుకుపోయి ఉంటాయని పోలీసులు అనుమానిస్తున్నారు. తమ కూతురు అన్ని శరీర భాగాలు తమకు అప్పగించాలని స్వాతి పేరేంట్స్ కోరుతున్నారు.

మహేందర్ రెడ్డితో పాటు ఆయన కుటుంబసభ్యులపై చర్యలు తీసుకోవాలని మృతురాలి ఫ్యామిలీ మెంబర్స్ డిమాండ్ చేస్తున్నారు. మహేందర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. మరో వైపు మహేందర్ రెడ్డి కుటుంబ సభ్యులు పరారీలో ఉన్నారని తెలుస్తోంది. వికారాబాద్ జిల్లా కామారెడ్డిగూడకు చెందిన మహేందర్ రెడ్డి, స్వాతి పక్క పక్క ఇళ్లలో ఉండేవారు. ఈ ఇద్దరూ ప్రేమించుకున్నారు. కులాలు వేరు కావడంతో పెద్దలు అంగీకరించలేదు. గత ఏడాది జనవరిలో ఆర్య సమాజ్ లో పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత బోడుప్పల్ లోని బాలాజీనగర్ లో కాపురం పెట్టారు. మహేందర్ రెడ్డి క్యాబ్ డ్రైవర్ గా, స్వాతి ఓ ప్రైవేట్ జాబ్ చేసేది. గతంలో కూడా భార్యా భర్తల మధ్య గొడవలు జరిగాయి. నాలుగు సార్లు కౌన్సిలింగ్ కు వెళ్లారు. తాజాగా స్వాతి గర్భం దాల్చింది. మెడికల్ చెకప్ విషయంలో భార్యా భర్తల మధ్య ఈ నెల 22న గొడవ జరిగిందని పోలీసులు తెలిపారు. ఈ నెల 23న కూడా మరోసారి గొడవ జరిగింది. ఆ సమయంలో స్వాతిపై మహేందర్ రెడ్డి దాడి చేశారు. అపస్మారక స్థితిలో ఉన్న శరీర భాగాలను వేరు చేశారని పోలీసులు తెలిపారు.

Exit mobile version