Site icon vidhaatha

ఇంట్లో నిమ్మ‌చెట్టు పెంచుకోకూడ‌దా..? వాస్తు నిపుణులు ఏమంటున్నారంటే..?

ఇంటి ఆవ‌ర‌ణ‌లో ఏ మాత్రం ఖాళీ స్థ‌లం ఉన్నా.. ఆ ప్లేస్‌లో పూల‌, పండ్ల మొక్క‌లు పెడుతుంటారు. ప్ర‌ధానంగా పూల మొక్క‌లు పెంచుతుంటారు. ఇక జామ‌, దానిమ్మ‌, నిమ్మ వంటి చెట్ల‌ను పెంచుతుంటారు. ఈ పండ్లు, పూల మొక్క‌ల వ‌ల్ల స్వ‌చ్ఛ‌మైన గాలి వ‌స్తుంది. అంతేకాకుండా మాన‌సిక ప్ర‌శాంత‌త కూడా ల‌భిస్తుంది. అయితే చాలా మంది ఇంటి ఆవ‌ర‌ణ‌లో నిమ్మ చెట్టును పెంచొద్ద‌ని చెబుతుంటారు. మ‌రి వాస్తు శాస్త్రం ప్ర‌కారం నిమ్మ చెట్టును ఇంటి ఆవ‌ర‌ణ‌లో పెంచుకోవ‌చ్చా..? లేదా..? అనే విష‌యాల‌ను తెలుసుకుందాం.
అన్ని పండ్ల చెట్ల మాదిరిగానే నిమ్మ చెట్టును కూడా పెంచుకోవ‌చ్చు. ఈ చెట్టును పెంచ‌డం వ‌ల్ల ఎలాంటి న‌ష్టం జ‌ర‌గ‌ద‌ని చెబుతున్నారు వాస్తు నిపుణులు. అశుభం జ‌రుగుత‌ద‌నేది కేవ‌లం అపోహ మాత్ర‌మే. ఇంట్లో నిమ్మ చెట్టును పెంచుకోవ‌డం వ‌ల్ల చాలా ర‌కాల ప్ర‌యోజ‌నాలు ఉన్నాయి.

 

Exit mobile version