Site icon vidhaatha

Dasara Festival | ద‌స‌రా పూజ‌కు శుభ స‌మ‌యం ఎప్పుడు..? ఈ ఏడాది 46 నిమిషాలే..!

Dasara Festival | హిందూ సంప్ర‌దాయం( Hindu Customs )లో ద‌స‌రా పండుగ‌( Dasara Festival )ను ప్ర‌తి ఏడాది ఆశ్వ‌యుజ మాసంలోని శుక్ల‌ప‌క్షంలోని ప‌దో రోజున జ‌రుపుకుంటారు. ద‌స‌రా హిందువుల‌కు చాలా ముఖ్య‌మైన‌, ప‌విత్ర‌మైన పండుగ‌. నవరాత్రుల తర్వాత పదవ రోజు చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా దసరా పండగను జరుపుకుంటారు. ఈ రోజున శ్రీరాముడు( Sri Ramudu ) లంకా రాజు రావణుని ( Ravan ) సంహరించాడు. అంతేకాదు ఈ రోజున దుర్గాదేవి ( Durga Devi ) మహిషాసురుడిని సంహరించింది. అందుకే ఆ రోజును విజయదశమి( Vijaya Dashami ) అని కూడా అంటారు. మ‌రి ఈ ఏడాది ద‌స‌రా పండుగ ఏ రోజు వ‌చ్చింది..? ద‌స‌రా రోజున ఏ స‌మ‌యంలో శుభ ముహుర్తం ఉంది..? పూజా ఏ స‌మ‌యంలో చేస్తే మంచిది..? అనే విష‌యాల‌ను తెలుసుకుందాం.

దసరా పండుగ ఎప్పుడంటే..?

హిందూ వేద క్యాలెండర్ ప్రకారం ఆశ్వయుజమాసంలో దశమి తిథి అక్టోబర్ 12 ఉదయం 10.58 గంటలకు ప్రారంభమవుతుంది. అక్టోబర్ 13 ఉదయం 9.08 గంటలకు దశమి తిథి ముగుస్తుంది.

దసరా పూజకు శుభ ముహూర్తం ఎప్పుడంటే..?

పంచాంగం ప్రకారం దసరా పూజ శుభ సమయం మధ్యాహ్నం 2:03 నుంచి 2:49 వరకు ప్రారంభమవుతుంది. దీని ప్రకారం ఈ ఏడాది పూజలకు 46 నిమిషాల సమయం ఉంటుంది. ఈ శుభ స‌మ‌యంలో మంచి పని ప్రారంభించి, అమ్మమీద భారం వేసి నిజాయితీగా శ్రమిస్తే తప్పక విజయం సొంతం అవుతుందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. ఏడాదంతా అంతా అద్భుత‌మైన విజ‌యాలు చేకూరుతాయ‌ని పేర్కొంటున్నారు.

Exit mobile version