Matchstick | ప్రతి మనిషికి మానసిక ప్రశాంతత అవసరం. అందుకే నివాసం కోసం నిర్మించే ఇల్లు( House )ను వాస్తు నియమాల( Vastu Tips ) ప్రకారం నిర్మిస్తారు. తద్వారా ఆ ఇంట్లో సంతోషకరమైన సానుకూల వాతావరణం ఏర్పడి.. మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. ఇది ఒత్తిడిని తగ్గించడమే కాకుండా.. మానసిక ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది. ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్య, మరి ముఖ్యంగా భార్యాభర్తల( Couples ) మధ్య సంబంధాలను బలోపేతం చేస్తుంది. అయితే ఇంటిని వాస్తు ప్రకారం నిర్మించినప్పటికీ.. కొన్ని విషయాల్లో తప్పులు చేస్తుంటారు. అదేంటంటే.. ఇంట్లోని పూజ గది( Puja Room )లో ఉంచకూడని వస్తువులను ఉంచుతుంటారు. ఆ వస్తువుల వల్ల ఆ ఇంట్లో అశాంతి ఏర్పడి, ఆర్థిక సంక్షోభానికి దారి తీస్తుందని వాస్తు, జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. మరి ఆ వస్తువు ఏంటంటే.. అగ్గిపుల్ల( Matchstick ).
ప్రతి ఇంట్లోని పూజ గదిలో ఒక అగ్గిపెట్టె( Match Box ) ఉంటుంది. ఎందుకంటే అగ్గిపుల్లతో దీపం వెలిగించడం, అగర్‌బత్తులు వెలిగించడం కోసం ఉపయోగిస్తుంటారు. కానీ ఇలా చేయడం మంచిది కాదని పండితులు హెచ్చరిస్తున్నారు. అగ్గిపుల్లను పూజ గదిలో ఉంచడం వల్ల ఆ ఇంట్లో కలహాలు ఏర్పడుతాయని, అశాంతిని సృష్టించి అగ్గి రాజేస్తాయని, ఆర్థిక సంక్షోభం ఏర్పడుతుందని చెబుతున్నారు. అందుకే అగ్గిపుల్లలను పూజ గదిలో కాకుండా వంటగదిలో ఉంచడం ఉత్తమమని సూచిస్తున్నారు.
ప్రార్థనా మందిరంలో అగ్గిపుల్లలు ఉంచడం వల్ల ఇంట్లో అశాంతి వాతావరణం పెరుగుతుందని వాస్తు శాస్త్రం తెలియజేస్తుంది. కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు పెరిగే అవకాశం ఉంది, ఎందుకంటే అగ్ని శక్తి అక్కడ ఉంటుంది. ఒకవేళ అగ్గిపుల్లలను పూజ గదిలో ఉంచాలనుకుంటే, వాటిని శుభ్రమైన గుడ్డలో చుట్టి ఉంచాలని సలహా ఇస్తున్నారు. దీపం వెలిగించిన తర్వాత అగ్గిపుల్లలను అలాగే వదిలేయడం దురదృష్టాన్ని కలిగిస్తుందని, ఇది ఇంట్లో పేదరికం ప్రతికూల శక్తిని పెంచుతుందని చెబుతారు. పూజ గదిని ఎప్పుడూ శుభ్రంగా, పవిత్రంగా ఉంచడం అవసరమని నిపుణులు సూచిస్తున్నారు.