Horoscope | సోమ‌వారం రాశిఫ‌లాలు.. ఈ రాశి నిరుద్యోగుల‌కు మంచి అవ‌కాశాలు..!

Horoscope | జ్యోతిష్యం అంటే న‌మ్మ‌కం. మ‌న‌కు అంతా మంచే జ‌ర‌గాల‌ని కోరుకుంటాం.. అందువ‌ల్ల ఈ రోజు మ‌న రాశిఫ‌లాలు ఎలా ఉన్నాయ‌ని చూసుకునే వారు చాలా మందే ఉంటారు. అలాంటి వారి కోసం నేటి రాశిఫ‌లాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

మేషం

ఈ రోజు ఆర్థికంగా కొంత ఒత్తిడి అనిపించవచ్చు. రావాల్సిన డబ్బులు ఆలస్యమవుతాయి, ఖర్చులు పెరుగుతాయి. పనుల్లో శ్రమ ఎక్కువగా పెట్టాల్సి వస్తుంది. అప్పుల విషయాల్లో ముందడుగు పడకపోవచ్చు. ఉద్యోగంలో మార్పుల సూచనలు కనిపిస్తాయి. ఇతరులతో చిన్నపాటి విభేదాలు రావచ్చు. శాంతంగా వ్యవహరించడం మంచిది.

వృషభం

స్థిరాస్తి వ్యవహారాల్లో మంచి లాభాలు దక్కే సూచనలు ఉన్నాయి. దూర ప్రయాణాలు ఆర్థికంగా ప్రయోజనకరంగా ఉంటాయి. ఉద్యోగంలో ఉన్నవారికి పై అధికారుల అనుకూలత లభించి ప్రమోషన్ అవకాశాలు కనిపిస్తాయి. మీ స్వంత నిర్ణయాలు ఈ రోజు మంచి ఫలితాలు ఇస్తాయి.

మిధునం

ఇంటి వాతావరణం ఉల్లాసంగా ఉంటుంది. బంధు మిత్రుల రాకపోకలతో సందడి పెరుగుతుంది. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు సక్సెస్ అవుతాయి. సమాజ సేవా కార్యక్రమాల్లో పాల్గొని గౌరవం పొందుతారు. నిరుద్యోగులకు మంచి అవకాశాలు కనిపిస్తాయి. పనులు సమయానికి పూర్తవుతాయి.

కర్కాటకం

అన్ని వైపుల నుంచి ఆదాయం వచ్చే సూచనలు ఉన్నాయి. మీకు ఇబ్బంది కలిగించిన సమస్యలు తొలగిపోతాయి. విలువైన వస్తువులు లేదా వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంది. పనులు ప్లాన్ ప్రకారం పూర్తవుతాయి. కుటుంబంలో శుభకార్యాలపై చర్చలు మొదలవుతాయి.

సింహం

ఉద్యోగంలో బాధ్యతలు పెరిగినా వాటిని నిర్వహించడంలో కొంత ఇబ్బంది పడవచ్చు. ఇంటి వాతావరణం కొంచెం టెన్షన్‌గా ఉంటుంది. నిరుద్యోగులకు ఫలితాలు ఆలస్యంగా రావచ్చు. పిల్లల చదువు, కెరీర్ విషయాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి.

కన్య

ఈ రోజు మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. వాహనం లేదా విలువైన వస్తువులు కొనుగోలు చేసే అవకాశం ఉంది. దూర ప్రయాణాలు లాభిస్తాయి. ముఖ్యమైన పనుల్లో సన్నిహితుల సహాయం అందుతుంది. ఆర్థిక ఒత్తిడి ఉన్నా అవసరాలు సజావుగా నెరవేరుతాయి. ఆస్తి సమస్యలు పరిష్కారం దిశగా కదులుతాయి.

తుల

పాత మిత్రులతో ముఖ్యమైన చర్చలు జరుగుతాయి. ఆర్థికంగా కొంత మెరుగుదల కనిపిస్తుంది. కుటుంబ విషయాల్లో మీ ఆలోచనలు అమలులోకి వస్తాయి. పనుల్లో ఉన్న అడ్డంకులు తొలగుతాయి. వ్యాపారంలో కీలక నిర్ణయాలు తీసుకునే సమయం ఇది.

వృశ్చికం

ఇతరులకు సహాయం చేసే అవకాశం ఉంటుంది. భాగస్వామ్య వ్యాపారాల్లో లాభాలు కనిపిస్తాయి. ఖర్చులకు సరిపడే ఆదాయం ఉంటుంది. పనులు కొంచెం నెమ్మదిగా సాగుతాయి. ఉద్యోగంలో ఉన్నవారికి అధికారుల సహకారం లభిస్తుంది. ఆరోగ్యంపై జాగ్రత్త అవసరం.

ధనస్సు

ఉద్యోగ ప్రయత్నాల్లో కొన్ని అడ్డంకులు ఎదురవుతాయి. అనుకోని ప్రయాణాలు అలసటను పెంచవచ్చు. పనులు నెమ్మదిగా సాగుతాయి. జీవిత భాగస్వామితో కలిసి ఆధ్యాత్మిక యాత్ర చేసే అవకాశం ఉంది. ఆర్థికంగా కొంత ఒత్తిడి ఉంటుంది.

మకరం

కుటుంబ సభ్యుల సలహాలు మీకు ఉపయోగపడతాయి. పనులు ఆలస్యంగా అయినా పూర్తవుతాయి. దూర ప్రాంత బంధువుల నుంచి ఆహ్వానాలు వస్తాయి. పిల్లల విద్య విషయంలో శుభవార్తలు వినిపిస్తాయి. వ్యాపార విస్తరణలో కొంత నిరాశ ఎదురవచ్చు.

కుంభం

చిన్నపాటి అడ్డంకులు పనుల్లో ఎదురవుతాయి. బంధువులతో స్వల్ప విభేదాలు రావచ్చు. అప్పుల ఒత్తిడి పెరుగుతుంది. ప్రయాణాల్లో మార్పులు చోటుచేసుకుంటాయి. వ్యాపారంలో భాగస్వాములతో జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగాల్లో పనులు నెమ్మదిగా సాగుతాయి.

మీనం

పాత మిత్రులతో కలిసి సంతోషకర సమయం గడుపుతారు. మీరు చేపట్టిన పనులు సాఫీగా సాగుతాయి. వివాదాలకు సంబంధించిన కీలక సమాచారం లభిస్తుంది. నిరుద్యోగులకు మంచి అవకాశాలు కనిపిస్తాయి. వ్యాపారాల్లో కొత్త ఆలోచనలు అమలు చేస్తారు. ఆర్థికంగా పురోగతి ఉంటుంది.

Latest News