Horoscope | సోమ‌వారం రాశిఫ‌లాలు.. ఈ రాశివారికి జీవిత భాగ‌స్వామితో క‌ల‌హాలు..!

Horoscope | జ్యోతిష్యం అంటే న‌మ్మ‌కం. మ‌న‌కు అంతా మంచే జ‌ర‌గాల‌ని కోరుకుంటాం.. అందువ‌ల్ల ఈ రోజు మ‌న రాశిఫ‌లాలు ఎలా ఉన్నాయ‌ని చూసుకునే వారు చాలా మందే ఉంటారు. అలాంటి వారి కోసం నేటి రాశిఫ‌లాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

మేషం (Aries)

మేష రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ప్రారంభించిన పనుల్లో విజయం సిద్ధిస్తుంది. ఉద్యోగ వ్యాపారాల్లో శుభవార్తలు అందుకుంటారు. పెద్దల ప్రోత్సాహంతో కీలక సమస్యలు పరిష్కరిస్తారు. ఆర్థిక వ్యవహారాల్లో అనుకూలత ఉంటుంది. స్థిరాస్తి వ్యవహారాల్లో అలోచించి నిర్ణయాలు తీసుకోవాలి.

వృషభం (Taurus)

వృషభ రాశి వారికి ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. వృత్తి పరమైన ఆందోళన, ఒత్తిళ్లు తొలగిపోయి సానుకూల పరిస్థితులు చోటు చేసుకుంటాయి. ఆర్థికంగా పుంజుకుంటారు. కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి. బంధుమిత్రులతో విందు వినోదాలలో పాల్గొంటారు. అనవసర ఖర్చులు పెరగకుండా చూసుకోండి.

మిథునం (Gemini)

మిథున రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. గత అనుభవాల ప్రభావం భవిష్యత్తుపై పడకుండా జాగ్రత్త వహించండి. ప్రారంభించిన పనుల్లో స్వల్ప ఆటంకాలు ఉండవచ్చు. చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. మధుర జ్ఞాపకాల్లో మునిగిపోతారు. ఉద్యోగ వ్యాపారాల్లో పెద్దల సలహాలు మేలు చేస్తాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గానే ఉంటుంది.

కర్కాటకం (Cancer)

కర్కాటక రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఆత్మవిశ్వాసంతో ఉద్యోగ వ్యాపారాల్లో ఉన్నత స్థానం సాధిస్తారు. భయాన్ని వీడి ధైర్యంగా ముందుకు సాగితే విజయం మీదే! ఆర్థిక పరిస్థితి క్రమంగా మెరుగు పడుతుంది. ముఖ్యమైన పనుల్లో ముందు చూపుతో తీసుకునే నిర్ణయాలు సఫలం అవుతాయి.

సింహం (Leo)

సింహ రాశి వారికి ఈ రోజు శుభప్రదంగా ఉంటుంది. ఆర్థికంగా ఈ రోజు విశేషమైన లాభాలు అందుకుంటారు. షేర్లు, స్టాకుల ద్వారా ఆర్థిక లబ్ది పొందుతారు. వ్యాపారులకు గత పెట్టుబడులు మంచి లాభాలు అందిస్తాయి. రుణభారం తగ్గుతుంది. వినోదంకోసం అధిక ధనవ్యయం ఉండవచ్చు. ఉద్యోగంలో స్థిరత్వం లభిస్తుంది. సన్నిహితులతో విహారయాత్రలకు వెళ్తారు.

కన్య (Virgo)

కన్య రాశి వారికి ఈ రోజు లాభదాయకంగా ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాల్లో ఆర్థిక ప్రయోజనాలు ఉంటాయి. మీ ఖ్యాతి, ప్రజాదరణ అన్ని వైపుల నుంచి బాగా పెరుగుతుంది. అనేక మార్గాల నుంచి డబ్బు రాక పెరుగుతుంది. బంధుమిత్రులతో సౌమ్యంగా వ్యవహరించాలి. వివాదాలకు, కలహాలకు దూరంగా ఉంటే మంచిది. కుటుంబ సహకారంతో కొన్ని సమస్యలు పరిష్కరిస్తారు.

తుల (Libra)

తులా రాశి వారికి ఈ రోజు అదృష్టదాయకంగా ఉంటుంది. అన్ని విధాలా అనుకూలమైన రోజు. ఉద్యోగ వ్యాపారాల్లో పట్టిందల్లా బంగారం అవుతుంది. స్వల్ప ప్రయత్నంతోనే గొప్ప విజయాలు సాధిస్తారు. ఆర్థికాభివృద్ధికి సంబంధించిన శుభవార్తలు వింటారు. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. జీవిత భాగస్వామితో తీర్థయాత్రలకు వెళ్తారు.

వృశ్చికం (Scorpio)

వృశ్చిక రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. చేపట్టిన పనుల్లో తొందరపాటు ఉండకూడదు. కీలక నిర్ణయాల్లో స్పష్టత అవసరం. ఉద్యోగ వ్యాపారాల్లో ఒత్తిడి, శ్రమ పెరిగినప్పటికీ మంచి ఫలితాలు రాబట్టుతారు. ఆదాయానికి సరిపడా ఖర్చులు కూడా ఉంటాయి. ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి పెరుగుతుంది.

ధనుస్సు (Sagittarius)

ధనుస్సు రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. కొన్ని ఊహించని సంఘటనలు జరగడం ఆందోళన కలిగిస్తుంది. ఉద్యోగ వ్యాపారాల్లో పనిభారం పెరగడంతో తీరిక లేకుండా ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది. మానసిక ఒత్తిడి పెరుగుతుంది. జీవిత భాగస్వామితో కలహాలు రాకుండా జాగ్రత్త వహించండి. వృథా ఖర్చులు పెరుగుతాయి.

మకరం (Capricorn)

మకర రాశి వారికి ఈ రోజు అద్భుతంగా ఉంది. గ్రహ సంచారం అనుకూలంగా ఉన్నందున ఏ పని తలపెట్టినా విజయం వెన్నంటే ఉంటుంది. పలు మార్గాలలో ఆర్థిక లాభాలు ఉంటాయి. వ్యాపార రంగంలో విశేషమైన లాభాలు వస్తాయి. కుటుంబంతో సరదాగా కాలక్షేపం చేస్తారు. భవిష్యత్తు శుభప్రదంగా ఉంటుంది.

కుంభం (Aquarius)

కుంభ రాశి వారికి ఈ రోజు సానుకూల ఫలితాలు ఉంటాయి. మంచికాలం ప్రారంభం అవుతోంది. గతంలోని ఇబ్బందికర పరిస్థితుల నుంచి బయట పడతారు. అన్ని రంగాల వారు తమ తమ రంగాల్లో విజయాన్ని చూస్తారు. మీ ప్రతిభకు, సమర్థతకు గుర్తింపు లభిస్తుంది. కుటుబ సభ్యులతో గడిపే సమయం మీకు సంతృప్తిని, ఆనందాన్ని ఇస్తుంది.

మీనం (Pisces)

మీన రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ముఖ్యమైన పనుల్లో పురోగతి ఉంటుంది. కుటుంబంతో, స్నేహితులతో కలిసి చేసే ప్రయాణాలు ఫలవంతం అవుతాయి. ఒక శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది. ఉద్యోగ వ్యాపారాల్లో అధికారుల ప్రశంసలు మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి. ఖర్చులపై నియంత్రణ అవసరం.

Latest News