మేషం
మేషరాశివారికి ఈ రోజు ఆనందంగా గడిచిపోతుంది. అన్ని రకాల ఆందోళనలు తొలగిపోతాయి. అన్నిపనులు ఒకేసారి చేయాలనుకుని ఒత్తిడికి లోనవుతారు. ఒక ప్రణాళిక ప్రకారం చేసుకుంటే అన్ని పనులు సకాలంలో పూర్తవుతాయి. రావాల్సిన బకాయిలు చేతికందుతాయి.
వృషభం
వృషభరాశివారికి ఈ రోజు అనుకూలంగా ఉంది. వృతివ్యాపారాల్లో రాణిస్తారు. పనులన్నీ సకాలంలో పూర్తి కావడం వల్ల విశ్రాంతి తీసుకుంటారు. స్వల్ప అనారోగ్య సూచనలు ఉన్నాయి.
మిథునం
మిథునరాశి వారికి ఈ రోజు అంత అనుకూలంగా లేదు. ముఖ్యమైన పనులు వాయిదా వేస్తే మంచిది. చిన్నపాటి అనారోగ్యం కలత పెడుతుంది. వృత్తివ్యాపారాల్లో ప్రతికూల ఫలితాలు ఉన్నాయి. ఆందోళన చెందవద్దు. సంయమనం పాటించండి.
కర్కాటకం
కర్కాటకరాశి వారికి ఈ రోజు అంత అనుకూలంగా లేదు. ఏ పని చేసినా ఆచి తూచి అడుగు వేయాలి. ఆరోగ్యం సహకరించదు. ఆర్ధిక నష్టం తలెత్తే ప్రమాదం ఉంది. ప్రమాదాలు పొంచి ఉన్నాయి. జాగ్రత్తగా ఉండండి. కుటుంబంలో ఘర్షణ వాతావరణం ఉంటుంది.
సింహం
సింహరాశి వారికి ఈరోజు ప్రతికూల పరిస్థితులు గోచరిస్తున్నాయి. జీవిత భాగస్వామితో చిన్నపాటి గొడవల కారణంగా అశాంతికి గురవుతారు. ఆరోగ్య భంగం ఉంటుంది. ఖర్చులు పెరుగుతాయి.
కన్య
కన్యారాశి వారికి ఈ రోజు అద్భుతంగా ఉంది. వృత్తి ఉద్యోగాల్లో అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. చేపట్టిన అన్ని పనులు దిగ్విజయంగా పూర్తవుతాయి. విపరీతమైన ధనలాభం. ఇంటి వాతావరణం ఆనందంగా ఉంటుంది.
తుల
తులారాశి వారికి ఈ రోజు సాధారణంగానే ఉంటుంది. మీ మాటలతో అందరినీ ఆకట్టుకుంటారు. కృషికి తగ్గ ఫలితం రాక నిరాశ చెందుతారు. సాధ్యమైనంత వరకు ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నించండి.
వృశ్చికం
వృశ్చికరాశి వారికి ఈ రోజు అంత అనుకూలంగా లేదు. సన్నిహితులతో జాగ్రత్తగా వ్యవహరించకపోతే గొడవలు రావచ్చు. అనారోగ్యం బాధ పెడుతుంది. మీ ప్రతిష్టకు భంగం కలిగే ఏ పని కూడా చేయవద్దు.
ధనుస్సు
ధనుస్సు రాశి వారికి ఈ రోజు అనుకూలంగా లేదు. మీరు పడ్డ శ్రమ అంతా బూడిదలో పోసిన పన్నీరు కావడం వల్ల నిరాశకు లోనవుతారు. తీవ్రమైన గొడవలకు ఆస్కారం ఉంది. ఒత్తిడిని అదుపులో పెట్టుకోండి.
మకరం
మకరరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. భవిష్యత్ గురించి ఒత్తిడికి గురవుతారు. దైవబలం ఉంటే తప్ప గట్టెక్కలేరు. వృత్తివ్యాపారాలో ఉండే వారికి ఉన్నతాధికారుల ప్రశంసలు లభిస్తాయి.
కుంభం
కుంభరాశి వారికి ఈ రోజు అద్భుతంగా ఉంది. ఎటు చూసినా లాభాలే లాభాలు. ప్రతికూల ఆలోచనలను వీడండి. ఆర్ధికంగా బలపడతారు. ఆరోగ్యం బాగుంటుంది.
మీనం
మీనరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంది. మిత్రుల సహాయంతో ఆపదల నుంచి బయట పడతారు. స్నేహం విలువను తెలుసుకుంటారు. ఆరోగ్యం సహకరిస్తుంది. ఒక శుభవార్త వింటారు.
06 – 04 – 2024 శనివారం రాశిఫలాలు.. మీ రాశిఫలం ఎలా ఉందంటే..?
అన్ని రకాల ఆందోళనలు తొలగిపోతాయి. అన్నిపనులు ఒకేసారి చేయాలనుకుని ఒత్తిడికి లోనవుతారు. ఒక ప్రణాళిక ప్రకారం చేసుకుంటే అన్ని పనులు సకాలంలో పూర్తవుతాయి. రావాల్సిన బకాయిలు చేతికందుతాయి.

Latest News
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అరెస్ట్
99డేస్ యాక్షన్ ప్లాన్ సక్సెస్ చేయాలి : సీఎం రేవంత్ రెడ్డి
పవన్ కల్యాణ్ ‘ప్రాజెక్టు హనుమాన్ ’ స్టార్ట్ !
వాగులో బయటపడ్డ 1000 సంవత్సరాల విష్ణు మూర్తి విగ్రహం!
తెలుగు రాష్ట్రాల్లో చంద్ర గ్రహణం వేళ.. బ్లడ్ మూన్ సీన్ !
నా జాగాలోకి ఎందుకొచ్చారు..మీ టౌన్ లోకి వస్తే ఊరుకుంటారా?: ఏనుగు ఫైర్
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న గుంటూరు కారం!
యుద్దం వేళ...ఇరాన్ లో భూకంపం !
విరోష్’ రిసెప్షన్‌కు హైటెక్ సెక్యూరిటీ..
ఖమేనీ కదలికలు ఏళ్లుగా ట్రాకింగ్.. 60 సెకన్లలో లక్ష్యం పూర్తి