Horoscope | బుధ‌వారం రాశిఫ‌లాలు.. ఈ రాశివారికి ఉద్యోగంలో ఉన్న‌త‌స్థితి..!

Horoscope | జ్యోతిష్యం అంటే న‌మ్మ‌కం. మ‌న‌కు అంతా మంచే జ‌ర‌గాల‌ని కోరుకుంటాం.. అందువ‌ల్ల ఈ రోజు మ‌న రాశిఫ‌లాలు ఎలా ఉన్నాయ‌ని చూసుకునే వారు చాలా మందే ఉంటారు. అలాంటి వారి కోసం నేటి రాశిఫ‌లాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

  • By: raj |    devotional |    Published on : Dec 24, 2025 6:40 AM IST
Horoscope | బుధ‌వారం రాశిఫ‌లాలు.. ఈ రాశివారికి ఉద్యోగంలో ఉన్న‌త‌స్థితి..!

మేషం (Aries) 

మేష రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఉద్యోగ వ్యాపారాల్లో సమయానుకూలంగా నడుచుకోవడం మంచిది. ఆశించిన ఫలితాల కోసం శ్రమ తప్పదు. ఒత్తిడికి లోను కాకుండా సహనంతో ఉండండి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గానే ఉంటుంది.

వృషభం (Taurus)

వృషభ రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఉద్యోగ వ్యాపారాల్లో శ్రమతో కూడిన ఫలితాలు ఉండవచ్చు. మీ ప్రతిభతో, సమయస్ఫూర్తితో ఉన్నతాధికారులను ఆకట్టుకుంటారు. ప్రారంభించిన పనుల్లో ఉత్సాహంతో ముందుకెళ్తే విజయం సిద్ధిస్తుంది. సహనం, ఓర్పుతో ఉండడం అవసరం. ఆదాయానికి సరిపడా ఖర్చులు కూడా ఉంటాయి.

మిథునం (Gemini)

మిథున రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. లక్ష్యంపై నుంచి దృష్టి మరలకుండా జాగ్రత్త వహించండి. ఉద్యోగులు అధికారులతో జాగ్రత్తగా నడుచుకోవాలి. వ్యాపారంలో ధనయోగాలున్నాయి. ఆస్థి వ్యవహారాలు ఆందోళన కలిగించవచ్చు. ఆర్థికపరమైన విషయాల్లో అప్రమత్తంగా ఉండాలి. ఒక తీర్థయాత్రకు అవకాశం ఉంది.

కర్కాటకం (Cancer)

కర్కాటక రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ముఖ్యమైన పనుల్లో విజయం లభిస్తుంది. మనోధైర్యంతో ప్రారంభించిన పనులు సునాయాసంగా పూర్తి చేస్తారు. కీలక వ్యవహారాల్లో కుటుంబ సభ్యుల సహకారం ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాల్లో పెద్దల సలహాలు మేలు చేస్తాయి. ఆర్థికంగా మేలైన సమయం. నూతన వస్తువాహనాలు కొనుగోలు చేస్తారు.

సింహం (Leo)

సింహ రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అన్ని రంగాల వారికి తమ తమ రంగాల్లో శ్రమ పెరుగుతుంది. వ్యాపారంలో విశేషమైన లాభాలు ఉంటాయి. కుటుంబ విషయాల్లో సహనం, సర్దుబాటు ధోరణి అవసరం. బుద్ధిబలంతో ఆదాయమార్గాలను పెంచుకుంటారు. వివాదాలకు దూరంగా ఉంటే మంచిది. ఉద్యోగంలో అనుకూల ఫలితాలు ఉంటాయి.

కన్య (Virgo)

కన్య రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. ప్రారంభించిన పనుల్లో పట్టుదల, ఏకాగ్రత అవసరం. ఉద్యోగ వ్యాపారాల్లో ఎప్పటి పనులు అప్పుడే పూర్తి చేసుకుంటే ఒత్తిడి తగ్గుతుంది. నిరంతర కృషితో క్రమంగా సమస్యలు తగ్గుతాయి. షేర్స్ లోనూ, స్టాక్స్ లోనూ పెట్టుబడులు పెట్టకండి. అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి.

తుల (Libra)

తులా రాశి వారికి ఈ రోజు ప్రతికూల ఫలితాలు ఉండవచ్చు. ఉద్యోగ వ్యాపారాల్లో వ్యతిరేక పరిస్థితులు ఉండవచ్చు. మీ కోప స్వభావంతో ఇబ్బందులు ఎదురవుతాయి. ఇంటా బయట శత్రువులు పెరుగుతారు. కోపం అదుపులో ఉంచుకోవాలి. సమాజంలో పరువు ప్రతిష్ఠలకు భంగం కలిగే సంఘటనలు జరగవచ్చు. మీ తల్లిగారి ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది.

వృశ్చికం (Scorpio)

వృశ్చిక రాశి వారికి ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. ధనయోగం బలంగా ఉంది. వ్యాపారానికి ఇది తగిన సమయం. చేపట్టిన పనుల్లో ఆటంకాలు తొలగిపోతాయి. ఆస్తులు, పెట్టుబడుల ద్వారా ధనవృద్ధి జరుగుతుంది. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాల్లో ఆర్థిక లాభాలు ఆనందం కలిగిస్తాయి.

ధనుస్సు (Sagittarius)

ధనుస్సు రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో శుభ ఫలితాలు అందుకుంటారు. సానుకూల దృక్పధంతో సమస్యలు సునాయాసంగా అధిగమిస్తారు. ఒక శుభవార్త మీ ఇంట్లో ఆనందం నింపుతుంది. కీలక వ్యవహారాల్లో విజయావకాశాలు మెరుగు పడతాయి.

మకరం (Capricorn)

మకర రాశి వారికి ఈ రోజు శుభప్రదంగా ఉంటుంది. ఆర్థికంగా విపరీతమైన లాభాలు అందుకుంటారు. ఆస్తులు వృద్ధి చేస్తారు. భూ, గృహ యోగాలున్నాయి. ఉద్యోగంలో అధికార యోగం ఉంటుంది. వ్యాపారులు వ్యాపారాన్ని విస్తరిస్తారు. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. కీలక వ్యవహారాల్లో ఆత్మీయుల సలహాలు అద్భుతంగా పనిచేస్తాయి.

కుంభం (Aquarius)

కుంభ రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఉద్యోగ వ్యాపారాల్లో ముందుచూపుతో నడుచుకోవడం మంచిది. దైవబలంతో ఆర్థిక వ్యవహారాల్లో అనుకూలత ఉంటుంది. ఉద్యోగంలో ఉన్నతస్థితి, స్థిరత్వం ఉంటుంది. సన్నిహితులతో విహారయాత్రలకు వెళ్తారు.

మీనం (Pisces)

మీన రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. సమయస్ఫూర్తితో, బుద్ధిబలంతో ఉద్యోగ వ్యాపారాల్లో ఒత్తిడి అధిగమిస్తారు. ఆర్థికంగా అంచెలంచెలుగా అభివృద్ధి సాధిస్తారు. వ్యాపారంలో తొందరపాటు నిర్ణయాలతో నష్టం కలగవచ్చు. కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి. ఖర్చులు పెరగకుండా జాగ్రత్త వహించండి.