ఈ రోజు అద్బుతమైన రోజు. ఆరోగ్యం సహకరిస్తుంది. ఉద్యోగులు తమ అధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు. వ్యాపారంలో మంచి విజయాలను సాధిస్తారు. ఆర్థికపరమైన ప్రయోజనాలు ఉంటాయి.
మేషం
ఈ రాశివారు ఆర్థికంగా లాభపడుతారు. సమాజంలో పేరు ప్రతిష్టలు సంపాదిస్తారు. వృత్తివ్యాపారాల్లో అద్భుతమైన ప్రయోజనాలను పొందుతారు. ఈ రాశి వారికి జీవితంలో నూతన శకం ప్రారంభం కానుంది. ఎటు చూసినా కలిసివచ్చే కాలంగానే కనిపిస్తోంది.
వృషభం
వృషభరాశి వారికి ఈ రోజు అద్బుతమైన రోజు. ఆరోగ్యం సహకరిస్తుంది. ఉద్యోగులు తమ అధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు. వ్యాపారంలో మంచి విజయాలను సాధిస్తారు. ఆర్థికపరమైన ప్రయోజనాలు ఉంటాయి. Also Read – భద్రాచలంలో ఈ నెల 9 నుంచి 23 వరకు శ్రీరామ నవమి బ్రహ్మోత్సవాలు
మిథునం
మిథునరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంది. ఉన్నతాధికారులతో జాగ్రత్తగా వ్యవహరించండి. రాజీ ధోరణి అవలంబిస్తే మేలు. విలాసాల కోసం డబ్బు ఖర్చు చేస్తారు. ఆరోగ్యం బాగుంటుంది.
కర్కాటకం
ఇవాళ ఈ రాశివారికి అంత అనుకూలంగా లేదు. ముఖ్యమైన పనుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మీ కుటుంబానికి చెడ్డపేరు తెచ్చే కార్యకలాపాలకు దూరంగా ఉంటే మేలు. ఇతరుల మనసు గాయపరిచేలా మాట్లాడవద్దు. మాటలు జాగ్రత్తగా మాట్లాడండి.
సింహం
సింహరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంది. మానసికంగా, శారీరకంగా సంతోషంగా ఉంటారు. బంధుమిత్రులతో సరదాగా కాలక్షేపం చేస్తారు. వ్యాపారపరంగా కీలక ఒప్పందాలు చేసుకుంటారు. Also Read – Kedarnath | కేదార్నాథ్ యాత్రకు వెళ్దామనుకుంటున్నారా..? మరి రిజిస్ట్రేషన్ ఎప్పటి నుంచో తెలుసా..?
కన్య
కన్యారాశి వారికి ఈ రోజు అద్భుతంగా ఉంది. ఈ రోజు చేసే ప్రతి పనిలో విజయం లభిస్తుంది. భాగస్వామ్య వ్యాపారం కలిసివస్తుంది. అన్ని పనులు సకాలంలో పూర్తి కావడం వల్ల సంతోషంగా ఉంటారు. బంధుమిత్రులతో విందువినోదాలలో పాల్గొంటారు.
తుల
తులారాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంది. కొన్ని రకాల చర్చల్లో, వాదనల్లో చురుగ్గా పాల్గొని మీ సత్తా ఏమిటో అందరికీ చూపిస్తారు. ఆరోగ్యం బాగుంటుంది. ఆర్థికంగా లాభాలు వస్తాయి.
వృశ్చికం
వృశ్చికరాశి వారికి ఈ రోజు అంత అనుకూలంగా లేదు. పట్టుదలకు పోవద్దు. భావోద్వేగాలతో తొందరపాటు నిర్ణయం తీసుకుంటే తరువాత చింతిచాల్సి వస్తుంది. ముఖ్యమైన పనులు వాయిదా వేస్తే మంచిది. స్వల్ప అనారోగ్య సూచనలు ఉన్నాయి.
ధనుస్సు
ధనుస్సురాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. రోజు ప్రారంభంలో బాగానే ఉన్నట్లు అనిపించినా కొన్ని సమస్యలు ఇబ్బంది పెడతాయి. ఇంట్లో గొడవల కారణంగా అశాంతికి లోనవుతారు.
మకరం
మకరరాశి వారికి ఈ రోజు అంత అనుకూలంగా లేదు. గొడవలు రాకుండా ఉండాలంటే మౌనాన్ని ఆశ్రయించడమే మేలు. ఆధ్యాత్మిక కార్యక్రమాల కోసం పెద్ద మొత్తంలో డబ్బు ఖర్చు చేస్తారు.
కుంభం
కుంభరాశి వారికి ఈ రోజు చాలా విశేషమైనది. ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న గమ్యాన్ని చేరుకుంటారు. వృత్తివ్యాపారాల్లో అద్భుతమైన ప్రయోజనాలను అందుకుంటారు. ఆకస్మిక ధనలాభం ఉంటుంది.
మీనం
మీనరాశి వారికి ఈ రోజు అంత అనుకూలంగా లేదు. కోరుకున్న ఫలితాలను పొందటానికి తీవ్రంగా శ్రమించాల్సి వస్తుంది. సన్నిహితులతో వివాదాలకు అవకాశముంది కాబట్టి కోపాన్ని అదుపులో పెట్టుకొని మాటలు జాగ్రత్తగా మాట్లాడండి.