Site icon vidhaatha

Horoscope | సోమ‌వారం రాశిఫ‌లాలు.. ఈ రాశివారు కోపం త‌గ్గింకుకుంటే బెట‌ర్..!

మేషం (Aries)

మేషరాశి వారికి ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. శుభ ఫలితాలు ఉంటాయి. సంతానం పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపిస్తారు. సహచరుల సహకారంతో చేపట్టిన పనులన్నీ పూర్తి చేస్తారు. ఆర్థికంగా శుభ యోగాలున్నాయి. స్వల్ప అనారోగ్య సమస్యలు ఉండవచ్చు.

వృషభం (Taurus)

వృషభరాశి వారికి ఈ రోజు శుభప్రదంగా ఉంటుంది. శుభవార్తలు వింటారు. ఉద్యోగ వ్యాపారాలలో శ్రమకు తగిన ఫలితాలు ఉంటాయి. సహకారం సంపూర్ణంగా ఉంటుంది. ఆర్థికంగా ఈ రోజు అత్యంత ఫలదాయకమైన రోజు. ఖర్చులు అదుపులో ఉంచుకోండి.

మిథునం (Gemini)

మిథునరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. ఆశించిన ఫలితాల కోసం తీవ్రంగా శ్రమించాలి. ఇంటా బయట సమస్యాత్మక పరిస్థితులు ఉండవచ్చు. ఎట్టి పరిస్థితుల్లో మనోధైర్యాన్ని కోల్పోవద్దు. అవమానకర పరిస్థితులకు దూరంగా ఉంటే మంచిది.

కర్కాటకం (Cancer)

కర్కాటకరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాలలో ఎలాంటి ఆటుపోట్లు లేకుండా సాఫీగా సాగిపోతాయి. ఆర్థిక పరిస్థితి సామాన్యంగా ఉంటుంది. ఒక ఘటన విచారం కలిగిస్తుంది. బంధువులతో మాటపట్టింపులు, మనస్పర్థలు వచ్చే అవకాశం ఉంది.

సింహం (Leo)

సింహరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. మీ స్వశక్తిని నమ్ముకుని ముందుకెళ్తే విజయం సిద్ధిస్తుంది. కీలక వ్యవహారాల్లో ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్తే సత్ఫలితాలు ఉంటాయి. వ్యాపారులకు ప్రయాణాలు లభిస్తాయి. ఆరోగ్యం సామాన్యంగా ఉంటుంది.

కన్య (Virgo)

కన్యారాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి. కుటుంబ సభ్యుల మధ్య వివాదాలకు ముగింపు పలుకుతారు. ఉద్యోగ వ్యాపారాలలో విశేషమైన ఆర్థిక లాభాలు ఉంటాయి. సన్నిహితులతో విహారయాత్రలకు వెళ్తారు.

తుల (Libra)

తులారాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. ప్రారంభించిన పనుల్లో ఎన్ని అడ్డంకులు వచ్చినా చిత్తశుద్ధితో ముందుకెళ్తేనే విజయం సిద్ధిస్తుంది. మనోధైర్యంతో చేసే పనులు కీర్తిని, సంతోషాన్ని ఇస్తాయి. ఒక సంఘటన మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. కోపాన్ని తగ్గించుకుని ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నించండి.

వృశ్చికం (Scorpio)

వృశ్చికరాశి వారికి ఈ రోజు అదృష్టకరంగా ఉంటుంది. ప్రత్యేకించి ఉద్యోగులకు ఈ రోజు శుభప్రదంగా ఉంటుంది. మీ పనితీరు పట్ల ఉన్నతాధికారులు సంతోషం వ్యక్తం చేస్తారు. కీలక వ్యవహారాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా స్థిరంగా ఉండాలి. ఆర్థిక వ్యవహారాలు అనుకూలం.

ధనుస్సు (Sagittarius)

ధనుస్సురాశి వారికి ఈ రోజు శుభప్రదంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాలలో అద్భుతమైన ఫలితాలు సొంతం చేసుకుంటారు. పెరిగిన ఆదాయం మనోబలాన్ని ఇస్తుంది. కీలక విషయాల్లో సమయస్ఫూర్తితో నడుచుకుంటే సత్ఫలితాలు ఉంటాయి. ఆకస్మిక ధనలాభాలకు అవకాశముంది.

మకరం (Capricorn)

మకరరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. కొన్ని వివాదాస్పద పరిస్థితుల్లో చిక్కుకుంటారు. కీలక వ్యవహారాల్లో పెద్దల సలహా మేరకు నడుచుకుంటే మంచిది. ఉద్యోగ వ్యాపారాలలో శ్రమకు తగిన ఫలితాలు ఉంటాయి. ఖర్చులు పెరగకుండా జాగ్రత్త పడండి. అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి.

కుంభం (Aquarius)

కుంభరాశి వారికి ఈ రోజు సరదాగా గడిచిపోతుంది. బంధుమిత్రులతో శుభకార్యాల్లో పాల్గొంటారు. ఉద్యోగంలో ఉన్నత స్థానం, గుర్తింపు లభిస్తాయి. వ్యాపారులు అధిక లాభాలు అందుకుంటారు. ఆర్థిక స్థితి మెరుగ్గా ఉంటుంది. స్థిరాస్తులు వృద్ధి చెందుతాయి.

మీనం (Pisces)

మీనరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి తమ తమ రంగాల్లో శ్రమ పెరుగుతుంది. ఆర్థికంగా క్లిష్ట సమయం. అవసరాన్ని డబ్బు చేతికి అందక ఇబ్బంది పడతారు. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకండి.

Exit mobile version