Site icon vidhaatha

Puja Timings | మ‌. 12 నుంచి 3 గంట‌ల మ‌ధ్య పూజకు స‌రైన స‌మ‌య‌మేనా..?

Puja Timings | చాలా మంది భ‌క్తులు( Devotees ) హడావిడిగా, ఏదో మొక్కుబడిగా పూజ( Puja ) చేస్తుంటారు. ఇలా చేసే వాటిని పూజ అనరని, ఇలాంటి హడావిడి పూజలను తంతు అంటారని చెబుతున్నారు. స‌మ‌య పాల‌న లేకుండా పూజ‌లు చేయ‌డం కూడా స‌రికాద‌ని పండితులు అంటున్నారు. మ‌ధ్యాహ్నం 12 నుంచి 3 గంట‌ల మ‌ధ్య‌లో పూజ‌కు శుభ స‌మ‌యం కాద‌ని పండితులు హెచ్చ‌రిస్తున్నారు. ఈ స‌మ‌యంలో ఎంత భ‌క్తితో పూజ చేసినా ఫ‌లితం ఉండ‌ద‌ని స్ప‌ష్టం చేస్తున్నారు. మ‌రి పూజ‌కు స‌రైన స‌మ‌యం ఏంటో తెలుసుకుందాం..

పూజ‌కు స‌రైన స‌మ‌యాలు ఇవే..

తెల్లవారుజామున 04:30 నుంచి 5:00 గంటల వరకు మొదటి పూజ చేయవచ్చు. బ్రహ్మ ముహూర్తంలో చేసే ఈ పూజ చాలా విశిష్టమైనది. ఫలితాలు కూడా చాలా త్వరగా వస్తాయి.

ఉదయం 09:00 గంటల నుంచి 11 గంటల లోపు చేసే పూజను రెండో పూజ అంటారు. ఇది మధ్యమ పూజ. ఈ పూజలో కూడా శుభఫలితాలు ఉంటాయి కానీ అంత త్వరగా రావు.

మధ్యాహ్నం 12:00 గంటల నుంచి చేసే పూజను మధ్యాహ్న పూజ అంటారు. ఈ పూజకు నియమాలెక్కువ. సరిగ్గా 2 నిముషాలలోనే ఈ పూజ పూర్తి చేయాల్సి ఉంటుంది. అభిజిత్ లగ్నంలో చేసే ఈ పూజలో ఫలితాలు కూడా శుభకరంగానే ఉంటాయి. ఈ పూజ చేసినప్పుడు దేవునికి విధిగా మహానైవేద్యం పెట్టాల్సి ఉంటుంది.

మధ్యాహ్నం 12 గంటల తరువాత, 3 గంటల మధ్య అసలు పూజలు చేయకూడదు. ఈ సమయంలో పూజ చేసినా కూడా ఫలితం ఉండదు.

సమయం లేక ఉదయం పూజ చేయలేని వారు సాయంత్రం వేళ‌ నిరభ్యంతరంగా సంధ్యపూజ చేయవచ్చు. ఈ పూజ సాయంత్రం 6 గంటల నుంచి 6:30 లోపు పూర్తి చేయాల్సి ఉంటుంది.

Exit mobile version