Kartika Pournami | అత్యంత పవిత్రమైన కార్తీక పౌర్ణమి( Kartika Pournami ) రోజున.. శుభాలు కలిగించే పనులు చేయాలని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. అంతేకానీ అవరోధాలు కలిగించే పనులు చేయడం మూలంగా జీవితాంతం నష్టపోయే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. మరి ఇవాళ కార్తీక పౌర్ణమి. కాబట్టి చేయాల్సిన పనులు, చేయకూడని పనులు ఏవో ఈ కథనం తెలుసుకుందాం..
కార్తీక పౌర్ణమి రోజున చేయాల్సిన పనులు..
- కార్తీక పౌర్ణమి రోజున నదీ స్నాయం చేయడం మంచిది.
- శివారాధన చేయడం శుభ ఫలితాలను ఇస్తుంది.
- వీలైతే ఆలయాల్లో, ఇంట్లో రుద్రాభిషేకం చేయడం శుభప్రదం.
- సూర్యాస్తమయం తర్వాత శివాలయంలో లేదా రావిచెట్టు, తులసి మొక్క వద్ద దీపాలు వెలిగిస్తే మంచిది.
- ఉసిరికాయలు దానం చేస్తే దారిద్య్రం తొలగిపోతుంది.
- నిరుపేదలకు అన్నదానం చేయాలి. వస్త్రదానం చేయడం, రోగులకు పండ్లు దానం చేస్తే పాపాలు తొలగిపోతాయి.
- మరి ముఖ్యంగా పెళ్లికానివారు కార్తీక పౌర్ణమి రోజు ఉసిరి-తులసి మొక్కను ఒకేదగ్గర చేర్చి ఆ పక్కనే రాధాకృష్ణుల విగ్రహం పెట్టి పూజచేస్తే ఉత్తమ జీవిత భాగస్వామి లభిస్తుంది.
కార్తీక పౌర్ణమి రోజున చేయకూడని పనులు ఇవే..
- కార్తీక పౌర్ణమి రోజు వెండి పాత్రలు, పాలను ఎవరికీ దానం ఇవ్వకూడదు.
- పున్నమి వెలుగుల వేళ ఇంట్లో ఏ మూలా చీకటి ఉండకూడదు.. ఇల్లంతా కూడా పండు వెన్నెలలా ఉండాలి.
- కార్తీక పౌర్ణమి రోజు మాంసాహారానికి దూరంగా ఉండాలి…సాత్విక ఆహారం మాత్రమే తీసుకోవాలి.
- ఇంటికి వచ్చిన బిచ్చగాడికి ఆహారం పెట్టండి, ఆకలితో ఉన్నవారికి అన్నదానం చేయండి.
- ఉపవాసం ఆచరించి నియమాలు పాటిస్తే ఇంకా శుభఫలితాలు పొందుతారు.
