Mole | పుట్టుకతో వచ్చే పుట్టుమచ్చలను ఎంతో అదృష్టంగా భావిస్తుంటారు. పుట్టుకతోనే కాకుండా శరీరం ఎదుగుదల క్రమంలో పుట్టుమచ్చలు ఏర్పడుతుంటాయి. ఇక పుట్టుకతోనే వచ్చిన పుట్టుమచ్చలు మాయమవుతుంటాయి కూడా. ఒక మనిషిని గుర్తించేందుకు పుట్టు మచ్చలు కీలక పాత్ర పోషిస్తాయి. ప్రతి స్టడీ సర్టిఫికెట్‌లోనూ సదరు విద్యార్థికి ఎక్కడ పుట్టుమచ్చలు ఉన్నాయో రాస్తుంటారు. ఎందుకంటే కచ్చితమైన విద్యార్థిని కనుగొనేందుకు.
మరి ముఖ్యంగా పుట్టు మచ్చలు మగువలకు ఎంతో అందాన్ని తీసుకొస్తాయి. ముఖంపై ఉండే పుట్టుమచ్చలు వారిలో ఉన్న సౌందర్యాన్ని మెరుగుపరుస్తాయి. అందంతో పాటు ఐశ్వర్యం కూడా పుట్టుమచ్చల వల్ల కలుగుతుందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. స్త్రీ శరీరంలో ఏ భాగంలో పుట్టమచ్చ ఉంటే ఏ లాభం జరుగుతుందో కూడా తెలుసుకోవచ్చట. మరి ఆ లాభాలు ఏంటో తెలుసుకుందాం..
రెండు కనుబొమ్మల మధ్య ఉంటే..
మగువలకు రెండు కనుబొమ్మల మధ్యలో పుట్టుమచ్చలు ఉంటే ధన ప్రాప్తి కలుగుతుందట. సంతానం కూడా కలుగుతుందని నమ్మకం. స్త్రీలకు చేతలు మీద కానీ నుదుటిపై పుట్టుమచ్చలు ఉంటే అలాంటి మహిళలకు తప్పకుండా మగ పిల్లలే జన్మిస్తారని విశ్వాసం. నుదుటి యొక్క కుడి భాగంలో పుట్టు మచ్చ ఉంటే వారి భర్త సంపాదన ఊహించనంతగా ఉంటుందట. నుదుటి ఎడమ వైపు పుట్టుమచ్చ ఉంటే సాధారణంగానే ఉంటారట. ఏ స్త్రీకి అయితే ఎడమ కడతపై పుట్టుమచ్చ ఉంటుందో వారు మంచి ప్రవర్తన, నడవడికలను కలిగి ఉంటారు. కుడి వైపు పుట్టుమచ్చ ఉంటే వీరు భర్త మాటకు గౌరవించి భర్త అడుగు జాడల్లోనే నడుచుకుంటారట.
ముక్కు మీద ఉంటే..
ముక్కు మీద పుట్టుమచ్చ ఉంటే ఆ మహిళలు అనుకున్న పనులలో పట్టుదల, ఆసక్తిని కనబరుస్తారట. అలాగే ముక్కు చివరన పుట్టుమచ్చ ఉంటే అలాంటి స్త్రీలు ధనవంతులై సకల సంతోషాలతో కలిగి ఉంటారట. వీరికి కలిగిన సంతానం అభివృద్ధి బాటలో నడుస్తూ కీర్తి ప్రతిష్టలు పొందుతారట.
పెదవులపై ఉంటే..
పెదవిపై పుట్టుమచ్చ ఉన్న స్త్రీ చాలా అదృష్టవంతురాలట. ఆమె జీవితంలో అన్ని రకాల ఆనందాలను పొందుతుందట.
భుజాల మీద ఉంటే..
స్త్రీలకు కుడి భుజం మీద పుట్టుమచ్చ ఉంటే వీరికి ధిక్కార స్వభావం కలిగి ఉంటారట. బంధుమిత్రులతో అనవసరమైన తగాదాలను పెట్టుకుంటారట. అలాగే స్త్రీలకు ఎడమ భుజం మీద పుట్టుమచ్చ ఉంటే వారికి చేతి నిండా ధనం కలిగి ఉంటారట. మనసులో పరిమితమైన కోరికలను కలిగి ఉంటారట. అయితే పుట్టుమచ్చ కుడి మోచేతి మీద ఉంటే మొదట్లో కష్టాలు ఉన్నా ధైర్యంగా నిలబడే స్వభావం కలిగి ఉంటారట. తద్వారా వీరు సుఖాలను అనుభవించగలరట. తమను తాము రక్షించుకోగలరని నమ్మకం.
చేతులపై ఉంటే..
స్త్రీల చేతులపై దోమ ఆకారంలో పుట్టుమచ్చ ఉంటే వీరికి పుత్ర సంతానం కలుగుతుందట. సంగీత సాహిత్యాలలో ప్రావీణ్యం కలిగి ఉంటారట. అలాగే అరచేతిలో పుట్టుమచ్చ ఉంటే అనేక విద్యలలో ప్రావీణ్యం కలిగి ఉంటారట.