విధాత : యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామికి సిరిసిల్ల చేనేత కార్మికుడు అగ్గిపెట్టెలో ఇమిడే బంగారు చీరను కానుకగా అందించాడు. సిరిసిల్లకు చెందిన నేతన్న నల్ల విజయ్ 2 గ్రాముల బంగారంతో అగ్గిపెట్టెలో ఇమిడేలా చీరను నేశాడు. మంగళవారం ఆలయ ప్రధాన అర్చకులు, ఏఈవో సమక్షంలో ఈ చీరను దేవస్థానానికి బహూకరించాడు. దీని పొడవు 5.30 మీటర్లు, వెడల్పు 48 ఇంచులు అని విజయ్ తెలిపాడు. గతంలో తన తండ్రి నల్ల పరంధాములు తొలిసారిగా అగ్గిపెట్టెలో ఇమిడే పట్టు చీరను తయారు చేసి సిరిసిల్ల చేనేత ఖ్యాతిని చాటారన్నారు. ఆయన వారసత్వాన్ని.. చేనేత ఖ్యాతిని అందిపుచ్చుకుని యాదగిరి గుట్ట, తిరుపతి, విజయవాడ కనకదుర్గ, వేములవాడ రాజన్నకు ఇవ్వడం ఆనవాయితీగా తీసుకున్నామన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తమకు సహకారం అందిస్తే భవిష్యత్తులో మరిన్ని చేనేత అద్భతాలు ప్రపంచానికి అందిస్తామన్నారు.
కాగా నల్ల విజయ్ గతంలో రంగులు మారే చీర, అగ్గిపెట్టెలో పట్టే చీర తయారు చేశాడు. ఆపరేషన్ సింధూర్ పేరుతో బంగారు శాలువాలు నేశాడు. దీనిని కూడా అగ్గిపెట్టెలో పట్టేలా నేయడం విశేషం. ఈ శాలువా 2 మీటర్ల పొడవు, 38 ఇంచుల వెడల్పు, 100 గ్రాముల బరువుతో 2 గ్రాముల బంగారాన్ని ఉపయోగించి నేశాడు. ఇటీవలే ‘క్యూ ఆర్ కోడ్’ శాలువాను రూపొందించాడు. శాలువాపై నేసిన క్యూఆర్ కోడ్ ను మొబైల్ ఫోన్ తో స్కాన్ చేస్తే తెలంగాణ చరిత్ర, సంస్కృతి, ప్రముఖ దేవాలయాలు, చారిత్రక కట్టడాలు మనకు కనిపిస్తాయి.
ఇవి కూడా చదవండి :
Elon Musk : సంపదలో ఎలాన్ మస్క్ సరికొత్త రికార్డు
India vs Malaysia : మలేషియాపై 315పరుగుల భారీ తేడాతో భారత్ విజయం
