Lord Shiva | శివుడిని పూజించేట‌ప్పుడు ఈ పొర‌పాట్లు అస‌లు చేయ‌కూడ‌దు..!

Lord Shiva | హిందూ పురాణాల ప్ర‌కారం ప్ర‌తి సోమ‌వారం శివుడిని పూజిస్తుంటారు. సోమ‌వారం వీలైనంత‌రం భ‌క్తులు శివాల‌యాల‌కు వెళ్తుంటారు. వీలుకాని భ‌క్తుల్లో ఇంట్లోనే శివుడికి పూజ‌లు నిర్వ‌హిస్తుంటారు. అయితే ఇంట్లో కానీ, ఆల‌యంలో కానీ శివుడిని పూజించేట‌ప్పుడు చాలా జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని పండితులు సూచిస్తున్నారు.

  • Publish Date - July 1, 2024 / 07:17 AM IST

Lord Shiva | హిందూ పురాణాల ప్ర‌కారం ప్ర‌తి సోమ‌వారం శివుడిని పూజిస్తుంటారు. సోమ‌వారం వీలైనంత‌రం భ‌క్తులు శివాల‌యాల‌కు వెళ్తుంటారు. వీలుకాని భ‌క్తుల్లో ఇంట్లోనే శివుడికి పూజ‌లు నిర్వ‌హిస్తుంటారు. అయితే ఇంట్లో కానీ, ఆల‌యంలో కానీ శివుడిని పూజించేట‌ప్పుడు చాలా జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని పండితులు సూచిస్తున్నారు. పూజా స‌మ‌యంలో పొర‌పాటు చేస్తే శివ‌య్య అనుగ్ర‌హం ల‌భించద‌ట‌. కాబ‌ట్టి ఎలాంటి పొర‌పాట్లు చేయ‌కూడ‌దో తెలుసుకుందాం..

తీసుకోవాల్సిన జాగ్ర‌త్త‌లు ఇవే..

  • వేకువ‌జామునే నిద్ర మేల్కొని అభ్యంగ‌న స్నానం ఆచ‌రించాలి. శుభ్ర‌మైన దుస్తులు ధ‌రించాలి. అనంత‌రం శివుడి ఫొటోను కానీ, శివ‌లింగాన్నీ ప‌రిశుభ్ర‌మైన నీటితో క‌డ‌గాలి. ఆ త‌ర్వాత శివ‌య్య‌కు ఇష్ట‌మైన పూల‌తో అల‌క‌రించాలి. ఇక పూజ‌ను ప్రారంభించాలి.
  • పూజ చేసే సమయంలో ‘ఓం నమః శివాయ’ మంత్రాన్ని స్మరించుకోవాలి. ఈ పంచాక్షరి మంత్రం చాలా శక్తివంతమైనది.
  • శివ‌య్య‌కు కుంకుమ పెట్ట‌కూడ‌దు. కేవ‌లం విభూతి, గంధం మాత్ర‌మే ఉప‌యోగించాలి. ఎంతో భ‌క్తితో ధ్యానం చేసే శివుడికి కుంకుమ పెట్ట‌డం వ‌ల్ల ఆ ఎరుపు రంగు శ‌రీరంలో వేడిని పుట్టింది. అందుకే కుంకుమకు బదులు చల్లదనాన్నిచ్చే గంధాన్ని ఉపయోగించాలి.
  • తులసి ఆకులను ఎట్టి పరిస్థితుల్లోనూ శివుడికి సమర్పించకూడదు. శివుడికి బిల్వ పత్రం సమర్పించడం చాలా ముఖ్యం. మూడు ఆకులతో కూడిన ఈ బిల్వ పత్రం శివుడి మూడు కనులను సంకేతం. అలాగే త్రిశూలానికి చిహ్నం. ఇవి గత మూడు జన్మల పాపాలను హరిస్తాయి.
  • అయితే ఈ ఆకులను చెట్టు నుంచి కోసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించాలి. బిల్వపత్రాన్ని సోమవారం, అమావాస్య, మకర సంక్రాంతి, పౌర్ణమి, అష్టమి, నవమి రోజుల్లో కోయరాదు. వీచిని చెట్టు నుంచి వేరు చేసిన తర్వాత నీటితో శుభ్రం చేసి మాత్రమే ఈశ్వరుడికి సమర్పించాలి.
  • సంపంగి పూలతో శివుడిని ఎట్టి పరిస్థితుల్లో పూజించరాదు. శివుడు.. సంపంగి పూలకు శాపం విధించినట్లు శాస్త్రం చెబుతోంది. ఓ సారి తప్పు సాక్ష్యం చెప్పడానికి సహాయపడమని బ్రహ్మ సంపంగి పూలను అడుగుతాడు. దీంతో బ్రహ్మను , సంపంగిని పూజకు పనికిరారని శివుడు శాపం విధించాడట.
  • కోరుకున్న అబ్బాయి లేదా అమ్మాయితో వివాహం జరగాలంటే శివుడ్ని గుండ్రటి మల్లె పూలతో పూజించాలి. శమీ పత్రంతో పూజ వల్ల మోక్షం కలుగుతుంది. జిల్లేడు పుష్పాలతో పూజ చేయడం వల్ల ఆరోగ్యంగా ఉంటాము.

Latest News