Tirumala | వృద్ధులకు శుభవార్త చెప్పిన టీటీడీ..! 30 నిమిషాల్లోనే శ్రీవారి దర్శనం..!

Tirumala | తిరుమల శ్రీవారి దర్శనానికి నిత్యం వేలాది మంది భక్తులు తరలివస్తుంటారు. భారీగా తరలివచ్చే భక్తులతో స్వామివారి ఉచిత దర్శనానికి గంటలకొద్దీ సమయం పడుతుంది. అన్ని గంటల పాటు క్యూలైన్లలో నిరీక్షించాలంటే ఎవరికైనా ఇబ్బందులు తప్పవు. మరీ ముఖ్యంగా సీనియర్‌ సిటిజన్స్‌ పరిస్థితి చెప్పాల్సిన పని లేదు. అయితే, వృద్ధులకు టీటీడీ ప్రత్యేక దర్శన సౌకర్యం కల్పిస్తున్నది.

  • Publish Date - June 16, 2024 / 09:07 AM IST

Tirumala | తిరుమల శ్రీవారి దర్శనానికి నిత్యం వేలాది మంది భక్తులు తరలివస్తుంటారు. భారీగా తరలివచ్చే భక్తులతో స్వామివారి ఉచిత దర్శనానికి గంటలకొద్దీ సమయం పడుతుంది. అన్ని గంటల పాటు క్యూలైన్లలో నిరీక్షించాలంటే ఎవరికైనా ఇబ్బందులు తప్పవు. మరీ ముఖ్యంగా సీనియర్‌ సిటిజన్స్‌ పరిస్థితి చెప్పాల్సిన పని లేదు. అయితే, వృద్ధులకు టీటీడీ ప్రత్యేక దర్శన సౌకర్యం కల్పిస్తున్నది. ఆన్‌లైన్‌ విధానంపై చాలామందికి అవగాహన లేక.. తిరుమలకు చేరుకొని ఇబ్బందులుపడుతుంటారు. ఈ క్రమంలో ఏపీలో కొత్తగా అధికారంలోకి వచ్చిన కూటమి సర్కారు టీటీడీలో పలు ప్రక్షాళనకు సిద్ధమైంది.

ఇందులో భాగంగా సీనియర్ సిటిజన్లకు తీపికబురు చెప్పింది. కేవలం అరగంటలోగా వృద్ధులు దర్శనాలు పూర్తి చేసుకునేలా ఏర్పాట్లు చేస్తున్నది. స్వామివారి ఉచిత దర్శనం కోసం సీనియర్ సిటిజన్‌లకు రెండు టైమ్ స్లాట్లు ఏర్పాటు చేసింది. ఒకటి ఉదయం 10 గంటలకు, మరొకటి మధ్యాహ్నం 3 గంటలకు ఉంటుంది. దాంతో వృద్ధులు తమ ఫొటో ఐడెండిటీ (ఆధార్ లేదంటే ఇతర డాక్యుమెంట్లు)తో వయసు రుజువు పత్రాలను ఎస్-1 కౌంటర్‌లో సమర్పించాలి. వృద్ధులు ఎక్కువ దూరం నుంచి క్యూలైన్లలో రావాల్సిన అవసరం లేకుండానే వంతెన కింద గ్యాలరీ నుంచి, ఎలాంటి మెట్లు ఎక్కాల్సిన అవసరం లేకుండానే శ్రీవారి దర్శనానికి వెళ్లేందుకు ఏర్పాటు చేసింది. అంతేకాదు, వృద్ధుల కోసం మంచి సీటింగ్‌ను సైతం అందుబాటులోకి తీసుకురానున్నారు. క్యూలైన్లలో వృద్ధులకు సాంబార్ అన్నం, పెరుగు అన్నం, వేడి పాలు సైతం అందిస్తారు.

క్యూలైన్లలో వృద్ధులకు ప్రతిదీ ఉచితమేనని టీటీడీ పేర్కొంది. వృద్ధులకు తక్కువ ధరకే రెండు లడ్డూలు అందివ్వనున్నారు. రూ.20 చెల్లించి రెండు లడ్డూలు తీసుకోవచ్చు. అదనంగా కావాలంటే ప్రతి లడ్డూకు రూ.25 చెల్లించాలి. ఆలయం ఎగ్జిట్‌ గేట్‌ వద్ద కార్‌ పార్కింగ్‌ ప్రాంతం నుంచి కౌంటర్‌ వద్ద వృద్ధులను డ్రాప్‌ చేసేందుకు బ్యాటరీ కారులు అందుబాటులో ఉంటాయి. ఈ ప్రత్యేక దర్శనం సమయంలో మిగతా దర్శనాలను నిలిపివేస్తారు. కేవలం వృద్ధుల క్యూలైన్లనే అనుమతిస్తారు. ఎలాంటి ఒత్తిడి లేకుండా కేవలం సీనియర్ సిటిజన్లు స్వామివారి దర్శనం చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. శ్రీవారి దర్శనం తర్వాత వృద్ధులు 30 నిమిషాల్లోపు ఆలయం నుంచి బయటకు రావొచ్చు. ఇతర వివరాల కోసం టీటీడీ ప్రత్యేక హెల్ప్ లైన్ నెంబరు 08772277777 అందుబాటులోకి తెచ్చింది.

Latest News