భార్య గ‌ర్భిణిగా ఉన్న‌ప్పుడు.. భ‌ర్త ఈ ప‌నులు అస‌లు చేయ‌కూడ‌దు..!

భార్య గ‌ర్భం దాల్చిన‌ట్లు తెలిస్తే భ‌ర్త‌తో పాటు ఆ కుటుంబ స‌భ్యులు అంద‌రూ ఎంతో సంతోషంగా ఫీల‌వుతారు. గ‌ర్భం దాల్చిన స్త్రీని కంటికి రెప్ప‌లా కాపాడుకుంటారు. తొమ్మిది నెల‌ల పాటు గ‌ర్భిణి స్త్రీని ఎంతో అపురూపంగా చూసుకుంటారు. ఐదో నెల‌లో ఆమెకు సీమంతం కూడా నిర్వ‌హిస్తారు. ఇక పుట్ట‌బోయే బిడ్డ గురించి ఆలుమ‌గ‌లు ఎన్నో క‌ల‌లు కంటుంటారు.

  • Publish Date - June 1, 2024 / 07:45 AM IST

భార్య గ‌ర్భం దాల్చిన‌ట్లు తెలిస్తే భ‌ర్త‌తో పాటు ఆ కుటుంబ స‌భ్యులు అంద‌రూ ఎంతో సంతోషంగా ఫీల‌వుతారు. గ‌ర్భం దాల్చిన స్త్రీని కంటికి రెప్ప‌లా కాపాడుకుంటారు. తొమ్మిది నెల‌ల పాటు గ‌ర్భిణి స్త్రీని ఎంతో అపురూపంగా చూసుకుంటారు. ఐదో నెల‌లో ఆమెకు సీమంతం కూడా నిర్వ‌హిస్తారు. ఇక పుట్ట‌బోయే బిడ్డ గురించి ఆలుమ‌గ‌లు ఎన్నో క‌ల‌లు కంటుంటారు. బిడ్డ భ‌విష్య‌త్ గురించి ఎన్నో ప్ర‌ణాళిక‌లు వేసుకుంటుంటారు. ఇదంతా ప‌క్క‌న పెడితే.. భ‌ర్త చాలా జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని పండితులు సూచిస్తున్నారు. భార్య గ‌ర్భిణిగా ఉన్న‌ప్పుడు భ‌ర్త కొన్ని ప‌నులు చేయ‌కూడ‌ద‌ని చెబుతున్నారు. మ‌రి ఆ ప‌నులేంటో తెలుసుకుందాం..

భ‌ర్త చేయ‌కూడ‌ని ప‌నులు ఇవే..

  • భార్య గ‌ర్భంతో ఉన్న‌ప్పుడు భ‌ర్త స‌ముద్రంలో స్నానం చేయ‌కూడ‌దు. చెట్ల‌ను కూడా న‌ర‌క‌కూడ‌దు. అలా చేస్తే పుట్ట‌బోయే బిడ్డ‌కు అరిష్టం క‌లుగుతుంద‌ట‌.
  • శ‌వాల‌ను మోయ‌కూడ‌దు. అంతిమ యాత్ర‌లో పాల్గొన‌కూడ‌దు. పిండ‌దానం వంటి కార్య‌క్ర‌మాల‌కు కూడా దూరంగా ఉండాలి. ఒక వేళ ఈ కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటే అరిష్టం చుట్టుకుంటుంద‌ట‌.
  • భార్య‌కు 7 నెల‌లు నిండిన త‌ర్వాత భ‌ర్త అస‌లు క్ష‌వ‌రం చేయించుకోకూడ‌ద‌ట‌.
  • 7వ నెల మొద‌లైన‌ప్ప‌టి నుంచి తీర్థ‌యాత్ర‌ల‌కు కూడా వెళ్ల‌కూడ‌ద‌ట‌.
  • భ‌ర్త గ‌ర్భిణిగా ఉన్న‌ప్పుడు గృహ ప్ర‌వేశాలు చేయ‌కూడ‌ద‌ట‌. వాస్తుక‌ర్మ నిర్వ‌హించ‌కూడ‌ద‌ట‌.
  • అయితే ప్రెగ్నెంట్‌గా ఉన్న భార్య ఏది అడిగితే అది భ‌ర్త తెచ్చివ్వాల‌ట‌. అలా చేస్తేనే ఆమె సంతోషంగా ఉండి, త‌ద్వారా పుట్ట‌బోయే బిడ్డ ఆరోగ్యంగా ఉంటుంద‌ట‌.

Latest News