Zodiac Signs | ఆగస్టు మాసం మరో రెండు రోజుల్లో ముగియనుంది. అంటే సోమవారం నుంచి సెప్టెంబర్( September ) మాసం ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ నెలలో రెండు రాశుల( Zodiac Signs ) వారికి అదృష్టం కలిసి రానుంది. ఎందుకంటే.. సెప్టెంబర్ మాసంలో సంపదకు కారకుడైన శుక్ర( Venus ) గ్రహం.. కీర్తి, వ్యాపార వృద్ధికి చిహ్నం అయిన చంద్ర( Moon ) గ్రహాల సంయోగం జరగనుందట. ఈ కలయిక ప్రభావం మొత్తం 12 రాశులపై పడనుంది. ఇందులో రెండు రాశుల వారికి మాత్రం పట్టిందల్లా బంగారమే కానుందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. మరి ఆ రెండు రాశులు ఏంటో తెలుసుకుందాం..
వృషభ రాశి( Taurus )
శుక్ర, చంద్ర గ్రహాల కలయిక కారణంగా వృషభ రాశివారికి అద్భుతమైన ప్రయోజనాలు చేకూరనున్నాయట. ఎవరూ ఊహించని విధంగా ధనం సమకూరుతుందట. ఇంట్లో శుభకార్యాలు కూడా జరిగే అవకాశం ఉందట. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారు అత్యధిక లాభాలను గడించే అవకాశం ఉందట. మొత్తంగా అన్ని రకాలుగా ఆదాయం పెరగడంతో.. కుటుంబ సభ్యులంతా సంతోషంగా గడుపుతారని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. భార్యాభర్తలు కూడా సుఖసంతోషాలతో ఉంటారట. ఇది వైవాహిక జీవితంలో మానసిక ప్రశాంతతను పెంపొందిస్తుందని పండితులు పేర్కొంటున్నారు.
మకర రాశి( Capricorn )
మకర రాశి వారికి కూడా అద్భుతమైన ప్రయోజనాలు కలిగే అవకాశం ఉందట. భాగస్వామ్య వ్యాపారాలు మంచి లాభాలను తెచ్చిపెడుతాయట. కొత్తగా పెట్టుబడులు పెట్టేందుకు కూడా అనుకూల సమయని పండితులు చెబుతున్నారు. ఎవరైతే చాలా రోజుల నుంచి పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారో, వారు ఈ మాసంలో పెడితే తిరుగు ఉండదని చెబుతున్నారు. ఉద్యోగులకు, వ్యాపారస్తులకు, రియలెస్టేట్ రంగంలో ఉన్నవారికి అనేక ప్రయోజనాలు కలుగుతాయంట. ముఖ్యంగా ఎవరైతే విదేశీ ప్రయాణం చేయాలనుకుంటారో వారికి సెప్టెంబర్ మాసం కలిసి వస్తుందంట. బ్యాంక్ బ్యాలెన్స్ పెరగడం, వ్యాపారంలో అధిక మొత్తంలో డబ్బు సంపాదించడం జరుగుతుందంట. అప్పుల సమస్యలు తీరిపోయి, ఆదాయం పెరుగుతుందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.