విధాత, అమరావతి : ఆంధ్రప్రదేశ్ పరీక్షల షెడ్యూల్ విడుదల అయింది. ఈ మేరకు ఇంటర్మీడియట్ బోర్డు 2026 సంవత్సరానికి సంబంధించిన ఫస్ట్, సెకండ్ ఇయర్ పరీక్షల టైమ్‌టేబుల్‌ను ప్రకటించింది. ఫిబ్రవరి 23 నుంచి మార్చి 24 వరకు పరీక్షలు కొనసాగనున్నాయి. ఫస్ట్ ఇయర్ పరీక్షలు ఫిబ్రవరి 23న 2nd లాంగ్వేజ్ పేపర్–I తో ప్రారంభమై, మార్చి 24న మోడ్రన్ లాంగ్వేజ్/జియోగ్రఫీ–I తో ముగుస్తాయి. ఇంగ్లీష్, హిస్టరీ, మ్యాథ్స్, జూలాజీ, ఎకనామిక్స్, ఫిజిక్స్, కామర్స్, సోషియాలజీ, కెమిస్ట్రీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ వంటి అంశాల పరీక్షలు వరుసగా జరుగనున్నాయి.
సెకండ్ ఇయర్ పరీక్షలు ఫిబ్రవరి 24న 2nd లాంగ్వేజ్ పేపర్–IIతో ప్రారంభమై, మార్చి 23న పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్/లాజిక్–IIతో ముగుస్తాయి. ఇంగ్లీష్, హిస్టరీ/బోటనీ, మ్యాథ్స్ పేపర్–II ఏ & II బీ, జూలాజీ, ఎకనామిక్స్, ఫిజిక్స్, కామర్స్, మ్యూజిక్, సోషియాలజీ, మోడ్రన్ లాంగ్వేజ్, జియోగ్రఫీ, కెమిస్ట్రీ వంటి ప్రధాన పరీక్షలు నిర్వహించనున్నారు. పరీక్షలకు సంబంధించిన పూర్తి షెడ్యూల్‌ను బోర్డు అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచినట్లు అధికారులు తెలిపారు. విద్యార్థులు తగిన విధంగా సిద్ధం కావాలని అధికారులు సూచించారు.
