Army Notification | ఇండియన్‌ ఆర్మీలో టెక్నికల్‌ గ్రాడ్యుయేట్‌ కోర్సు.. ఎవరు అర్హులంటే..!

Army Notification | ఇండియన్‌ ఆర్మీలో టెక్నికల్‌ గ్రాడ్యుయేట్‌ కోర్సులో ప్రవేశాలకు నోటిఫికేషన్‌ విడుదలైంది. మొత్తం 30 సీట్లు ఖాళీగా ఉన్నాయి. ఈ కోర్సులో ఇప్పటికే 139 బ్యాచ్‌లు పూర్తయ్యాయి. ఇది 140వ బ్యాచ్‌. ప్రవేశపరీక్షలు, ఇంటర్వ్యూలు, మెడికల్‌ టెస్టుల ద్వారా ఈ కోర్సులో ప్రవేశాలు కల్పిస్తారు. చేరదల్చుకున్న కోర్ ఇంజినీరింగ్‌ స్ట్రీమ్‌లో బీఈ లేదా బీటెక్‌ పూర్తి చేసిన వారు ఈ కోర్సు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

  • Publish Date - April 18, 2024 / 11:15 AM IST

Army Notification : ఇండియన్‌ ఆర్మీలో టెక్నికల్‌ గ్రాడ్యుయేట్‌ కోర్సులో ప్రవేశాలకు నోటిఫికేషన్‌ విడుదలైంది. మొత్తం 30 సీట్లు ఖాళీగా ఉన్నాయి. ఈ కోర్సులో ఇప్పటికే 139 బ్యాచ్‌లు పూర్తయ్యాయి. ఇది 140వ బ్యాచ్‌. ప్రవేశపరీక్షలు, ఇంటర్వ్యూలు, మెడికల్‌ టెస్టుల ద్వారా ఈ కోర్సులో ప్రవేశాలు కల్పిస్తారు. చేరదల్చుకున్న కోర్ ఇంజినీరింగ్‌ స్ట్రీమ్‌లో బీఈ లేదా బీటెక్‌ పూర్తి చేసిన వారు ఈ కోర్సు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. నోటిఫికేషన్‌కు సంబంధించిన మరిన్ని వివరాలు మీ కోసం..

మొత్తం సీట్లు : 30 (140వ టెక్నికల్‌ గ్రాడ్యుయేట్‌ కోర్సు)
కోర్‌ ఇంజనీరింగ్‌ స్ట్రీమ్‌ : సివిల్, కంప్యూటర్‌ సైన్స్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, మెకానికల్ తదితర స్ట్రీమ్‌లు
అర్హతలు : సంబంధిత ఇంజనీరింగ్‌ విభాగంలో బీఈ/బీటెక్‌ ఉత్తీర్ణులు లేదా కోర్సు చివరి సంవత్సరం చదువుతున్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
వయసు : 2025 జనవరి 1 నాటికి 20-27 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక విధానం : ధరఖాస్తుల షార్ట్‌ లిస్టింగ్, స్టేజ్‌-1, స్టేజ్‌ -2 టెస్టులు, ఎస్‌ఎస్‌బీ ఇంటర్వ్యూ, మెడికల్‌ టెస్టుల ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి 12 నెలలపాటు డెహ్రాడూన్‌లోని ఇండియన్‌ మిలిటరీ అకాడమీలో శిక్షణ ఉంటుంది. ఈ సమయంలో లెఫ్ట్‌నెంట్‌ ర్యాంకుతో షార్ట్‌ సర్వీస్‌ కమిషన్‌ లభిస్తుంది. శిక్షణ అనంతరం పర్మనెంట్‌ కమిషన్‌ ఇస్తారు.
దరఖాస్తు విధానం : ఆన్‌లైన్‌లో
చివరి తేది : 2024 మే 9
వెబ్‌సైట్‌ : https://joinindianarmy.nic.in/Authentication.aspx

Latest News