UPSC Notification | డిగ్రీతో కేంద్ర బలగాల్లో అసిస్టెంట్‌ కమాండెంట్ జాబ్స్‌.. నోటిఫికేషన్ రిలీజ్‌..!

UPSC Notification | డిగ్రీ అర్హతతో కేంద్ర సాయుధ బలగాల్లో అసిస్టెంట్‌ కమాండెంట్‌ ఉద్యోగం దక్కించుకునే అవకాశం ఉంది. ఈ కేంద్ర సాయుధ బలగాల్లో బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF), సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF), సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF), ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ (ITBP), సశస్త్ర సీమా బల్ (SSB) బలగాలు ఉంటాయి.

UPSC Notification : డిగ్రీ అర్హతతో కేంద్ర సాయుధ బలగాల్లో అసిస్టెంట్‌ కమాండెంట్‌ ఉద్యోగం దక్కించుకునే అవకాశం ఉంది. ఈ కేంద్ర సాయుధ బలగాల్లో బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF), సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF), సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF), ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ (ITBP), సశస్త్ర సీమా బల్ (SSB) బలగాలు ఉంటాయి. ఆయా బలగాల్లో 506 అసిస్టెంట్ కమాండెంట్ (గ్రూప్ ఎ) పోస్టుల భర్తీకి సంబంధించి 2024కుగాను సెంట్రల్‌ ఆర్మ్‌డ్‌ పోలీస్‌ ఫోర్సెస్‌ (CAPF) పరీక్ష నోటిఫికేషన్‌ను UPSC విడుదల చేసింది.

ఖాళీల వివరాలు

మొత్తం ఖాళీలు – 506
బీఎస్‌ఎఫ్‌ (BSF) – 186
సీఆర్‌పీఎఫ్‌ (CRPF) – 120
సీఐఎస్‌ఎఫ్‌ (CISF) – 100
ఐటీబీపీ (ITBP) – 58
ఎస్‌ఎస్‌బీ (SSB) – 42

అర్హతలు

కనీసం బ్యాచిలర్ డిగ్రీ పూర్తిచేసి ఉండాలి. నిర్దిష్ట శారీరక, వైద్య ప్రమాణాలు కలిగి ఉండాలి. 2024 ఆగస్టు 1 నాటికి 20 నుంచి 25 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి.

ఎంపిక ఎలా..?

ముందుగా రాత పరీక్ష నిర్వహిస్తారు. రాత పరీక్షలో పేపర్ 1, పేపర్ 2 ఉంటాయి. అనంతరం వైద్య పరీక్షలు చేయించి, శారీరక సామర్థ్య పరీక్షలు నిర్వహిస్తారు. ఆ తర్వాత ఇంటర్వ్యూ ఉంటుంది. చివరగా డాక్యుమెంట్ వెరిఫికేషన్ నిర్వహిస్తారు.

దరఖాస్తు : దరఖాస్తు రుసుము రూ.200 (ఎస్సీ, ఎస్టీ, మహిళా అభ్యర్థులకు మినహాయింపు) ఉంటుంది.
తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు : హైదరాబాద్, తిరుపతి, విశాఖపట్నం.

ముఖ్యమైన తేదీలు

దరఖాస్తు విధానం : ఆన్‌లైన్‌లో
చివరి తేదీ : 2024 మే 14
పరీక్ష తేదీ : 2024 ఆగస్టు 4
వెబ్‌సైట్ : https://upsc.gov.in/