‘ఫీల్ గుడ్’ నుంచి ‘మమ్మా మియా’ పాట విడుదల

సుచిత్, అదితి త్రిపాఠి జంటగా ప్రేమను ఆవిష్కరించే మధురమైన గీతం

టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా అవుతూ తెరకెక్కుతున్న రొమాంటిక్‌ కామెడీ చిత్రం ‘ఫీల్‌ గుడ్‌’ నుంచి ‘మమ్మా మియా’ పూర్తి పాటను చిత్ర బృందం విడుదల చేసింది. విశ్వరూప ఫిల్మ్స్ బ్యాన‌ర్‌పై దయానంద్‌ కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వంలో సుచిత్ నిర్మాణంలో సుచిత్‌, అదితి త్రిపాఠి జంటగా నటించిన ఈ పాట‌ ఆకట్టుకునే సంగీతం, మధురమైన గాత్రంతో ప్రేమలోని మాధుర్యాన్ని ఆవిష్కరిస్తోంది. యువతను ఆకట్టుకునే బాణీ, ఉత్సాహభరితమైన పదాలు పాటకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి.

‘వైబ్‌’, ‘సింక్‌’, ‘ట్రెండ్‌’, ‘హైప్‌’ వంటి పదాలతో సాగిపోయే ఈ పాటలో యూత్‌ఫుల్‌ ఎనర్జీ కనిపిస్తుంది. ల‌వ్‌లోని సరదా, స్నేహం, ధైర్యం, ఉత్సాహాన్ని ప్రతిబింబించేలా పాటను రూపొందించారు. శాండిల్య పిసపాటి అందించిన మ్యూజిక్, కడలి స‌త్య‌నారాయ‌ణ‌ సాహిత్యం, తుషార నిలయ, శాండిల్య పిసపాటి పాడిన ఈ పాట నేటి యువత అభిరుచులకు అనుగుణంగా ఫీల్ గుడ్‌గా రూపొందింది. మ్యూజిక్ ల‌వ‌ర్స్‌ను ఎట్రాక్ట్ చేసేలా ఉంది.

ఈ చిత్రంలో సుచిత్‌, అదితి త్రిపాఠితో పాటు రవూరి ప్రియాంక, లిఖిత్‌, రణధీర్‌ వాసుదేవ్‌, సైఫాని, దివ్య మోహన్‌ తదితరులు నటిస్తున్నారు. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని త్వ‌ర‌లోనే విడుద‌ల చేయ‌డానికి చిత్ర‌యూనిట్ స‌న్నాహాలు చేస్తోంది. ‘మమ్మా మియా’ పాట విడుదలతో ‘ఫీల్‌ గుడ్‌’ చిత్రంపై ప్రేక్షకుల్లో ఆసక్తి మరింత పెరుగుతుందని, యూత్ ఆడియ‌న్స్‌కు క‌నెక్ట్ చేస్తుంద‌ని చిత్ర బృందం ఆశిస్తోంది.

Latest News