Aarthi Agarwal | ఆర్తి అగ‌ర్వాల్ మ‌ర‌ణానికి అస‌లు కార‌ణాలు ఏంటి… అమ్మ రాజశేఖర్ చెప్పిన ఆస‌క్తిక‌ర విష‌యాలు

Aarthi Agarwal | ఒకప్పుడు తెలుగు సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్‌గా వెలుగొందిన ఆర్తి అగర్వాల్ తక్కువ కాలంలోనే అపారమైన గుర్తింపు సంపాదించింది. ఉదయ్ కిరణ్, తరుణ్ వంటి యువ హీరోలతో పాటు చిరంజీవి, వెంకటేష్ వంటి సీనియర్ నటులతో కూడా నటించి తనకంటూ ప్రత్యేక స్థానం ఏర్పరుచుకుంది.

Aarthi Agarwal | ఒకప్పుడు తెలుగు సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్‌గా వెలుగొందిన ఆర్తి అగర్వాల్ తక్కువ కాలంలోనే అపారమైన గుర్తింపు సంపాదించింది. ఉదయ్ కిరణ్, తరుణ్ వంటి యువ హీరోలతో పాటు చిరంజీవి, వెంకటేష్ వంటి సీనియర్ నటులతో కూడా నటించి తనకంటూ ప్రత్యేక స్థానం ఏర్పరుచుకుంది. అయితే, ఆమె అకాల మరణం అభిమానులకు, సినీ వర్గాలకు పెద్ద షాక్‌గా మారింది.

ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో దర్శకుడు, కొరియోగ్రాఫర్ అమ్మ రాజశేఖర్ ఆర్తి అగర్వాల్ వ్యక్తిగత, వృత్తి జీవితానికి సంబంధించిన పలు విషయాలను వెల్లడించారు. తాను ఆమెకు సన్నిహితుడినని, నువ్వు నాకు నచ్చావ్ సినిమాలో డాన్స్ మాస్టర్‌గా పని చేసినట్లు చెప్పారు. ఆ సినిమాలో షూటింగ్ సమయంలో ఆర్తి ఎంతో చురుకుగా, అమాయకంగా ఉండేదని, “లడ్డులా క్యూట్‌గా కనిపించేది” అని గుర్తుచేసుకున్నారు.

ప్రేమ విఫ‌లం కావ‌డం..

ఆర్తి అగర్వాల్ కెరీర్ పతనం వెనుక ప్రధాన కారణంగా ఒక ప్రేమ వ్యవహారాన్ని ఆయన ప్రస్తావించారు. ఆ ప్రేమ విఫలమవడంతో ఆమె మానసికంగా తీవ్రంగా దెబ్బతిన్నదని, దాని ప్రభావం ఆమె సినిమాలపై పడిందని తెలిపారు. ఈ మానసిక ఒత్తిడి కారణంగా ఆమె బరువు పెరిగిందని, దాంతో అవకాశాలు తగ్గిపోయాయని వివరించారు.

అదే సమయంలో తాను తెరకెక్కించిన “రణం 2” సినిమాలో ఆమెను హీరోయిన్‌గా ఎంపిక చేశానని, కానీ రెండో షెడ్యూల్‌కు వచ్చినప్పుడు ఆమె శరీరాకృతి మారిపోయిందని చెప్పారు. దుస్తులు సరిపోకపోవడంతో చిత్రీకరణలో ఇబ్బందులు ఎదురయ్యాయని తెలిపారు. ఆమె తండ్రి ఆమెను మళ్లీ సన్నగా మార్చేందుకు ప్రయత్నాలు చేశారని, కొన్ని శస్త్రచికిత్సలు కూడా చేయించారని, కానీ అవి ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదని పేర్కొన్నారు.

అవి తీవ్రంగా ప్ర‌భావితం చేశాయి..

కెరీర్‌లో ఉన్న‌త స్థాయిని చేరుకున్న‌ప్ప‌టికీ, అదే సమయంలో విమర్శలు, అవమానాలను ఎదుర్కోవాల్సి రావడం ఆమెను మరింత మానసికంగా బాధించిందని ఆయన అన్నారు. ఈ సంఘటనలన్నీ కలిపి ఆమె జీవితాన్ని తీవ్రంగా ప్రభావితం చేశాయని చెప్పారు.

ఆర్తి అగర్వాల్ జీవిత గాథ మరోసారి సినీ పరిశ్రమలో ఉన్న ఒత్తిళ్లు, వ్యక్తిగత సమస్యలు ఎంతటి ప్రభావం చూపుతాయో గుర్తు చేస్తోంది. ఆమె మరణం ఇప్పటికీ అభిమానులను కలచివేస్తూనే ఉంది.

Latest News