South Korea: రెప్పపాటులో కుంగిన రోడ్డు.. ఓ ప్రాణం బలి!
రహదారి మీదుగా రయ్య్ మని దూసుకుపోతున్న వాహనాల ముందు ఊహించని రీతిలో ఆకస్మాత్తుగా రోడ్డు కుంగిపోతే..ఆ వాహనదారుల గుండె జారిపోక మానదు.

Road Sudden Collapsed: రహదారి మీదుగా రయ్య్ మని దూసుకుపోతున్న వాహనాల ముందు ఊహించని రీతిలో ఆకస్మాత్తుగా రోడ్డు కుంగిపోతే..ఆ వాహనదారుల గుండె జారిపోక మానదు. అలాంటి ఘటనే సౌత్ కొరియాలోని గ్యాంగ్ డాంగ్ జిల్లాలో చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఓ బైకర్ ప్రాణాలు కోల్పోయాడు. వివరాల్లోకి వెళితే సౌత్ కొరియాలోని గ్యాంగ్ డాంగ్ జిల్లాలో వాహనాలతో రద్ధీగా ఉండే హైవే రోడ్డులో ఉన్నట్టుండి భారీ సింక్‌హోల్ ఏర్పడింది. రోడ్డు మీద వేగంగా వెలుతున్న కారు సడన్ బ్రేక్ తో గాల్లోకి ఎగిరి పడింది. మరో బైక్ మాత్రం గుంతలో పడిపోయింది. దీంతో బైక్ నడుపుతున్న వ్యక్తి అందులో గల్లంతయ్యాడు.
సమాచారం అందుకున్న రెస్క్యూ సిబ్భంది సహాయక చర్యలు చేపట్టగా ముందుగా బైక్ మాత్రమే లభించింది. దాదాపు 12 గంటల నిరీక్షణ తర్వాత అతని మృత దేహాన్ని రెస్క్యూటీమ్ గుర్తించింది. ప్రమాద సమయంలో చాల వాహనాలు అటుగా వెలుతున్నా.. అదృష్టవశాత్తు ఒక్క బైక్ మాత్రమే ఆ భారీ గుంతలో పడిపోగా..పెద్ధ ప్రాణ నష్టం తప్పింది. కళ్ల ముందు ప్రమాదాన్ని చూసిన వాహనదారులు తాము ఆ గండం బారిన పడనందుకు బతుకు జీవుడా అనుకున్నారు.
ALSO READ : Indore ‘Jab We Met’ | ప్రేమికుడి కోసం పారిపోయిన యువతి..వేరేవాణ్ని పెళ్లిచేసుకుని వచ్చింది.!