Anasuya | మరింత ముదిరిన శివాజీ-అనసూయ వివాదం.. కౌంటర్లతో హాట్ టాపిక్‌గా మారిన ‘దండోరా’ కాంట్రవర్సీ

Anasuya | నటుడు శివాజీ, నటి అనసూయ భరద్వాజ్ మధ్య మాటల యుద్ధం రోజు రోజుకు తీవ్రమవుతోంది. ఇటీవల ‘దండోరా’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో హీరోయిన్ల డ్రెస్సింగ్‌పై శివాజీ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలను అనసూయతో పాటు పలువురు సినీ ప్రముఖులు తప్పుపట్టారు. విమర్శలు వెల్లువెత్తడంతో శివాజీ తన తప్పు తెలుసుకుని వీడియో విడుదల చేసి క్షమాపణలు కూడా చెప్పారు.

Anasuya | నటుడు శివాజీ, నటి అనసూయ భరద్వాజ్ మధ్య మాటల యుద్ధం రోజు రోజుకు తీవ్రమవుతోంది. ఇటీవల ‘దండోరా’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో హీరోయిన్ల డ్రెస్సింగ్‌పై శివాజీ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలను అనసూయతో పాటు పలువురు సినీ ప్రముఖులు తప్పుపట్టారు. విమర్శలు వెల్లువెత్తడంతో శివాజీ తన తప్పు తెలుసుకుని వీడియో విడుదల చేసి క్షమాపణలు కూడా చెప్పారు. అయితే, ఆ క్షమాపణలతోనే వివాదం ముగియలేదు. ఈ వ్యవహారం కాస్తా ఇప్పుడు ‘శివాజీ వర్సెస్ అనసూయ’ అన్నట్టుగా మారింది. ఇద్దరూ ఒకరిపై ఒకరు సెటైరికల్ కామెంట్స్, కౌంటర్లతో సోషల్ మీడియాలో హీట్ పెంచుతున్నారు.

తాజాగా ‘దండోరా’ ప్రెస్ మీట్‌లో శివాజీ మరోసారి తన వ్యాఖ్యలపై స్పందించారు. తాను మాట్లాడినదాంట్లో రెండు పదాలు మాత్రమే తప్పుగా దొర్లాయని, అందుకు బాధపడుతున్నానని చెప్పారు. అయితే తన స్టేట్‌మెంట్‌కు మాత్రం కట్టుబడి ఉంటానని, ఎవరికీ భయపడే అవసరం లేదన్నారు. ఇదే సమయంలో అనసూయపై వ్యంగ్యంగా మాట్లాడారు. ఈ ఇష్యూలోకి ఆమె ఎందుకు వచ్చిందని ప్రశ్నించిన శివాజీ, తనపై జాలి చూపించినందుకు ఆమెకు థ్యాంక్స్ కూడా చెప్పారు. అంతేకాదు, ఆమె రుణం తీర్చుకునే అవకాశం దేవుడు ఇవ్వాలని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలకు అనసూయ గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. ఆమె ఓ వీడియో విడుదల చేసి శివాజీ వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో స్పందించారు. “అతి వినయం ధూర్త లక్షణం అని మా ఇంట్లో నేర్పించేవారు. ప్రెస్ మీట్‌లో మీరు విక్టిమ్ ప్లే చేయడం నార్సిసిజం లక్షణం. ఇది మిసోజనిస్టిక్ బిహేవియర్” అంటూ అనసూయ విమర్శించారు.

ఫెమినిజం గురించి మాట్లాడిన అనసూయ, “ఫేక్ ఫెమినిజం అనే మాటే లేదు. ఫెమినిజం అంటే ఆడ, మగ సమాన హక్కులు. బట్టల గురించి మాట్లాడటం చేతగానితనం, ఇన్సెక్యూరిటీకి నిదర్శనం. సెల్ఫ్ కంట్రోల్ లేని వాళ్లే ఇతరులను కంట్రోల్ చేయాలని చూస్తారు” అని అన్నారు. అలాగే, హీరోయిన్లు ఎలా బట్టలు వేసుకోవాలో ఎవరు చెప్పాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. “మేము చిన్నపిల్లలం కాదు. మా హక్కులు మాకు తెలుసు. గ్లామరస్‌గా ఉండటం మా ఇష్టం. మా బట్టలు మేమే నిర్ణయించుకుంటాం” అని చెప్పారు. శివాజీ చేసిన క్షమాపణలపై కూడా ఆమె స్పందిస్తూ, “రెండు పదాలకు సారీ చెప్పి తప్పించుకోవడం ఇంత ఈజీ కాదు” అని వ్యాఖ్యానించారు.

చివరిగా, “ఆడవాళ్లకు రక్షణ గురించి మాట్లాడాలంటే, మగవాళ్లకు గౌరవం నేర్పించండి. బట్టలు మేటర్ కాదు, క్యారెక్టర్ మేటర్” అంటూ తన స్టేట్‌మెంట్‌ను ముగించారు. శివాజీ తన పేరు తీసుకుని జాలి చూపించానన్న వ్యాఖ్యలపై స్పందిస్తూ, “నన్ను నేను ఎలా రక్షించుకోవాలో నాకు తెలుసు. మీ సపోర్ట్ నాకు అవసరం లేదు” అని తేల్చిచెప్పారు.ఈ వివాదం ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. శివాజీ, అనసూయ మధ్య మాటల యుద్ధం ఇంకెంత దూరం వెళ్తుందో చూడాలి.

Latest News