Bigg Boss 10 | ‘బిగ్‌బాస్ 10’ గ్రాండ్ ఎంట్రీకి రంగం సిద్ధం.. నాగార్జున పవర్‌ఫుల్ ప్రోమోతో ఆకాశాన్నంటిన అంచ‌నాలు

Bigg Boss 10 | తెలుగు బుల్లితెర ప్రేక్షకులను ఏళ్లుగా అలరిస్తున్న అత్యంత ప్రజాదరణ పొందిన రియాలిటీ షో ‘బిగ్‌బాస్ తెలుగు’ మరోసారి సరికొత్త సీజన్‌తో ప్రేక్షకుల ముందుకు రానుంది. వరుసగా తొమ్మిది విజయవంతమైన సీజన్లను పూర్తి చేసుకున్న ఈ షో ఇప్పుడు పదో సీజన్‌తో మరింత గ్రాండ్‌గా ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమవుతోంది.

Bigg Boss 10 | తెలుగు బుల్లితెర ప్రేక్షకులను ఏళ్లుగా అలరిస్తున్న అత్యంత ప్రజాదరణ పొందిన రియాలిటీ షో ‘బిగ్‌బాస్ తెలుగు’ మరోసారి సరికొత్త సీజన్‌తో ప్రేక్షకుల ముందుకు రానుంది. వరుసగా తొమ్మిది విజయవంతమైన సీజన్లను పూర్తి చేసుకున్న ఈ షో ఇప్పుడు పదో సీజన్‌తో మరింత గ్రాండ్‌గా ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమవుతోంది. ఇప్పటికే షోకు సంబంధించిన అధికారిక ప్రోమో విడుదల కాగా, అది సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఎప్పటిలాగే ఈ సీజన్‌కూ కింగ్ అక్కినేని నాగార్జున హోస్ట్‌గా వ్యవహరించనున్నారు. తన స్టైలిష్ ప్రెజెన్స్, ఎనర్జీతో ప్రోమోలో కనిపించిన నాగ్, మరోసారి ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తించారు.

ప్రోమో ప్రారంభంలోనే “బిగ్‌బాస్ అంటే ఎన్నో యుద్ధాలు గెలిచిన రాజ్యం మాత్రమే కాదు… లక్షలాది హృదయాలను గెలుచుకున్న మహా సామ్రాజ్యం” అంటూ నాగార్జున చెప్పిన పవర్‌ఫుల్ డైలాగ్ ఆకట్టుకుంది. ఈ సామ్రాజ్యాన్ని నిర్మించింది, ప్రేమించింది ప్రేక్షకులేనని ఆయన చెప్పడం అభిమానులను మరింత ఉత్సాహపరిచింది.

డిఫ‌రెంట్ కాన్సెప్ట్‌తో..

ఈసారి ప్రోమోను విభిన్న కాన్సెప్ట్‌తో రూపొందించారు. సెలూన్ షాపుల నుంచి ఐటీ కార్యాలయాల వరకు, చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు, కుటుంబ సభ్యుల నుంచి యువత వరకు సమాజంలోని అన్ని వర్గాల ప్రజలు బిగ్‌బాస్ కోసం ఎంత ఆసక్తిగా ఎదురుచూస్తారో చూపించారు. ఈ షో కేవలం వినోద కార్యక్రమం మాత్రమే కాకుండా, అనేక మంది జీవితాల్లో భాగంగా మారిందనే సందేశాన్ని అందించారు.

అలాగే “నాగ్ సార్‌కి మేము కల్ట్ ఫ్యాన్స్” అంటూ సాగే బ్యాక్‌గ్రౌండ్ సాంగ్ ప్రోమోకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ మ్యూజిక్‌తో పాటు విజువల్స్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఇక ప్రోమో చివర్లో నాగార్జున చెప్పిన మాటలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. “ఈ ప్రస్థానం మరో కొత్త అధ్యాయానికి సాక్ష్యం కాబోతోంది. ఈసారి మీరు చూడబోయేది బిగ్‌బాస్ దశావతారం. ఈసారి ఆటలో సవాల్ కాదు… ఆటే సవాల్!” అంటూ ఆయన చెప్పడంతో కొత్త సీజన్‌పై అంచనాలు మరింత పెరిగాయి.

కంటెస్టెంట్స్ ఎవ‌రు…

గత సీజన్‌లో సెలబ్రిటీలతో పాటు సామాన్యులకు కూడా అవకాశం కల్పించడం విశేషంగా నిలిచింది. ఎన్నో దశల ఎంపిక ప్రక్రియను దాటుకుని హౌస్‌లోకి అడుగుపెట్టిన కామన్ మ్యాన్ కళ్యాణ్ పడాల చివరకు విజేతగా నిలిచి చరిత్ర సృష్టించాడు. దీంతో ఈసారి కూడా సామాన్యులకు అవకాశం ఉంటుందా? లేక పూర్తిగా సెలబ్రిటీ కంటెస్టెంట్లతోనే షోను నిర్వహిస్తారా? అనే ఆసక్తి నెలకొంది.

అలాగే ఈ సీజన్‌లో పాల్గొనబోయే కంటెస్టెంట్లు ఎవరు? షో ఎప్పుడు ప్రారంభమవుతుంది? కొత్త టాస్కులు, కొత్త రూల్స్ ఎలా ఉండబోతున్నాయి? వంటి ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే. మొత్తానికి ‘బిగ్‌బాస్ తెలుగు 10’ ప్రోమో విడుదలతోనే బుల్లితెర ప్రేక్షకుల్లో భారీ ఉత్సాహం నెలకొంది. ఈసారి నిజంగానే “ఆటే సవాల్”గా మారుతుందా లేదా అన్నది త్వరలో తేలనుంది.

 

Latest News