Chiranjeevi | 15 లక్షల వ‌ల్ల‌ ‘బాషా’ను మిస్ చేసుకున్న చిరంజీవి .. చేసి ఉంటే టాలీవుడ్ చరిత్ర మారిపోయేదా?

Chiranjeevi | ఇండస్ట్రీలో కొన్ని కాంబినేషన్లు ఎప్పటికీ ట్రెండ్ సెట్టర్లుగా నిలిచిపోతాయి. అలాంటి అరుదైన సినిమాల్లో ఒకటి బాషా. సూపర్‌స్టార్ రజనీకాంత్ మేనరిజమ్స్, దర్శకుడు సురేష్ కృష్ణ టేకింగ్, సంగీత దర్శకుడు దేవా బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అన్ని కలిసొచ్చి ఈ సినిమాను చరిత్రగా మలిచాయి. ఈ చిత్రం రజనీకాంత్‌ను స్టార్ స్థాయి నుంచి సూపర్‌స్టార్ స్థాయికి తీసుకెళ్లిన మైలురాయిగా నిలిచింది.

Chiranjeevi | ఇండస్ట్రీలో కొన్ని కాంబినేషన్లు ఎప్పటికీ ట్రెండ్ సెట్టర్లుగా నిలిచిపోతాయి. అలాంటి అరుదైన సినిమాల్లో ఒకటి బాషా. సూపర్‌స్టార్ రజనీకాంత్ మేనరిజమ్స్, దర్శకుడు సురేష్ కృష్ణ టేకింగ్, సంగీత దర్శకుడు దేవా బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అన్ని కలిసొచ్చి ఈ సినిమాను చరిత్రగా మలిచాయి. ఈ చిత్రం రజనీకాంత్‌ను స్టార్ స్థాయి నుంచి సూపర్‌స్టార్ స్థాయికి తీసుకెళ్లిన మైలురాయిగా నిలిచింది.

అయితే ఈ బ్లాక్‌బస్టర్ వెనుక ఒక ఆసక్తికరమైన “మిస్సింగ్ లింక్” ఉంది , అది మెగాస్టార్ చిరంజీవితో ముడిప‌డి ఉంది . 1994లో చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ‘బిగ్ బాస్’ అనే సినిమా ఘనంగా ప్రారంభమైంది. ‘గ్యాంగ్ లీడర్’ తర్వాత విజయ బాపినీడు–చిరంజీవి కాంబోలో వస్తున్న చిత్రం కావడంతో అంచనాలు భారీగా పెరిగాయి. ఇదే సమయంలో చెన్నైలో ఒకే స్టూడియోలో ‘బిగ్ బాస్’ మరియు ‘బాషా’ షూటింగ్‌లు పక్కపక్కనే జరుగుతున్నాయి.

క‌థ న‌చ్చినా కూడా..

ఆ సమయంలో ఈ రెండు సినిమాల కథలు దాదాపు ఒకే తరహాలో ఉన్నాయన్న వార్తలు సినీ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి. ఈ నేపథ్యంలో సురేష్ కృష్ణ స్వయంగా చిరంజీవిని కలిసి ‘బాషా’ కథను వివరించారు. కథ చిరంజీవికి, నిర్మాత అల్లు అరవింద్‌కి బాగా నచ్చింది. వెంటనే తెలుగు రీమేక్ హక్కుల కోసం చర్చలు మొదలయ్యాయి.

కానీ అక్కడే కథలో ట్విస్ట్ వచ్చింది. ‘బాషా’ నిర్మాతలు రీమేక్ హక్కుల కోసం రూ.40 లక్షలు డిమాండ్ చేయగా, అల్లు అరవింద్ ఆ మొత్తాన్ని రూ.25 లక్షలకు తగ్గించాలని కోరారు. కేవలం రూ.15 లక్షల తేడా కారణంగా ఒప్పందం కుదరలేదు. ఆ చిన్న వ్యత్యాసమే భారీ అవకాశాన్ని దూరం చేసింది.

తెలుగులో భాషాగా చిరంజీవి..

తర్వాత 1995 జనవరిలో తమిళంలో విడుదలైన ‘బాషా’ సంచలన విజయం సాధించింది. ఆ విజయాన్ని చూసిన తర్వాత, రీమేక్ కంటే డబ్బింగ్ చేయడమే మంచిదని భావించి అదే ఏడాది ఏప్రిల్‌లో తెలుగులో డబ్ చేసి విడుదల చేశారు. ఒకవేళ అప్పట్లో ఆ రూ.15 లక్షల విషయంలో రాజీ పడితే, తెలుగులో ‘బాషా’గా చిరంజీవిని చూసే అవకాశం ప్రేక్షకులకు దక్కేదని సినీ విశ్లేషకులు ఇప్పటికీ చెబుతుంటారు.

‘బాషా’ కేవలం సినిమా కాదు ఒక ట్రెండ్ సెట్టర్. 1995లోనే ఈ చిత్రం సుమారు రూ.30–33 కోట్ల వసూళ్లు సాధించి సౌత్ ఇండియన్ బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టింది. “బాషా ఒక్కసారి చెబితే… వందసార్లు చెప్పినట్టు” అనే డైలాగ్ ఐకానిక్‌గా నిలిచింది. తెలుగులో డబ్బింగ్ సినిమా అయినప్పటికీ, స్థానిక స్టార్ హీరోల చిత్రాలకు పోటీగా నిలిచింది.

చాలా చిత్రాల‌కి ప్రేర‌ణ‌గా బాషా

ఈ సినిమా ప్రభావం అంతటితో ఆగలేదు. అండర్‌ప్లే హీరో – పవర్‌ఫుల్ ఫ్లాష్‌బ్యాక్ అనే ఫార్ములాకు ఇది నిఘంటువులా మారింది. తర్వాత వచ్చిన సమరసింహారెడ్డి, ఇంద్ర వంటి బ్లాక్‌బస్టర్లకు ఇది ప్రేరణగా నిలిచింది. అంతేకాదు, రజనీకాంత్‌కు జపాన్‌లో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడటానికి కూడా ‘బాషా’ కీలక పాత్ర పోషించింది.

2017లో డిజిటల్ వెర్షన్‌గా రీ-రిలీజ్ అయినప్పుడు కూడా ప్రేక్షకులు అదే ఉత్సాహంతో స్వాగతించడం ఈ సినిమా శాశ్వత ప్రభావాన్ని మరోసారి నిరూపించింది. మొత్తానికి, ‘బాషా’ లాంటి ఇండస్ట్రీ హిట్‌ను చిరంజీవి మిస్ చేసుకోవడం టాలీవుడ్ చరిత్రలో ఒక పెద్ద నిరాశ‌గా మిగిలిపోయింది.

Latest News