Mrunal Takhur | లావణ్య తర్వాత మృణాల్‌కి అల్లు అరవింద్ సలహా.. ‘తెలుగు అబ్బాయినే పెళ్లి చేసుకో’ …

Mrunal Takhur | స్టార్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ మరోసారి తన సరదా కామెంట్స్‌తో వార్తల్లో నిలిచారు. గతంలో హీరోయిన్ లావణ్య త్రిపాఠికు ఇచ్చిన సలహా నిజమైన నేపథ్యంలో, ఇప్పుడు అదే సూచనను హీరోయిన్ మృణాల్ ఠాకూర్‌కి కూడా ఇవ్వడం చర్చనీయాంశమైంది.

  • By: Sandeep |    movies |    Published on : Apr 13, 2026 12:45 PM IST
Mrunal Takhur | లావణ్య తర్వాత మృణాల్‌కి అల్లు అరవింద్ సలహా.. ‘తెలుగు అబ్బాయినే పెళ్లి చేసుకో’ …

Mrunal Takhur | స్టార్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ మరోసారి తన సరదా కామెంట్స్‌తో వార్తల్లో నిలిచారు. గతంలో హీరోయిన్ లావణ్య త్రిపాఠికు ఇచ్చిన సలహా నిజమైన నేపథ్యంలో, ఇప్పుడు అదే సూచనను హీరోయిన్ మృణాల్ ఠాకూర్‌కి కూడా ఇవ్వడం చర్చనీయాంశమైంది.

తాజాగా డెకాయిట్ సినిమా సక్సెస్ మీట్‌లో ముఖ్య అతిథిగా పాల్గొన్న అల్లు అరవింద్, స్టేజ్‌పై మాట్లాడుతూనే మృణాళ్‌పై సరదాగా వ్యాఖ్యలు చేశారు. “గతంలో లావణ్య త్రిపాఠికి నేను ఒక సలహా ఇచ్చాను. తెలుగు అబ్బాయినే పెళ్లి చేసుకుంటే ఇక్కడే సెటిల్ అవుతావని చెప్పాను. కొంతకాలానికి ఆమె మా వరుణ్ తేజ్‌నే పెళ్లి చేసుకుంది” అని గుర్తు చేశారు.

నువ్వు తెలుగు అబ్బాయినే పెళ్లి చేసుకో..

అదే తరహాలో ఇప్పుడు మృణాళ్ ఠాకూర్‌ను ఉద్దేశించి మాట్లాడుతూ, “నువ్వూ ఒక తెలుగు అబ్బాయినే పెళ్లి చేసుకో. అప్పుడు ఇక్కడే సెటిల్ అవుతావు. మాకు నువ్వు చాలా కావాలి. ఇక్కడే ఉండేలా చేయడానికి ఇదే మార్గం” అంటూ నవ్వుతూ వ్యాఖ్యానించారు. ఆయన మాటలకు సభలో ఉన్న వారంతా పగలబడి నవ్వారు.

ఈ కార్యక్రమంలో హీరో అడివి శేష్‌తో పాటు ఇతర అతిథులు కూడా పాల్గొన్నారు. అల్లు అరవింద్ వ్యాఖ్యలపై స్టేజ్‌పైనే సరదా వాతావరణం నెలకొంది.

ధ‌నుష్‌తో డేటింగ్‌లో ఉన్న‌ట్టు రూమ‌ర్స్..

ఇదిలా ఉండగా, మృణాళ్ ఠాకూర్ వ్యక్తిగత జీవితంపై గతంలో కొన్ని రూమర్స్ వినిపించిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా తమిళ హీరో ధనుష్తో ఆమె డేటింగ్‌లో ఉన్నారనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే ఆ ప్రచారంలో ఎలాంటి నిజం లేదని మృణాళ్ ఇప్పటికే స్పష్టం చేసింది.

మరోవైపు ‘డెకాయిట్’ సినిమాకు మిక్స్‌డ్ టాక్ వచ్చినప్పటికీ, బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లు రాబడుతున్నట్లు చిత్రబృందం చెబుతోంది. ఈ విజయాన్ని పురస్కరించుకుని నిర్వహించిన సక్సెస్ మీట్‌లో అల్లు అరవింద్ చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఏది ఏమైన సరదాగా చేసినా అల్లు అరవింద్ వ్యాఖ్యలు మరోసారి చర్చకు దారితీస్తుండగా, మృణాల్‌ భవిష్యత్తులో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అన్న ఆసక్తి అభిమానుల్లో నెలకొంది.