Akira Nandan | అకీరా ఎంట్రీపై ఆసక్తి పెంచిన అడివి శేష్ వ్యాఖ్యలు… మెగా అభిమానుల్లో జోష్‌

Akira Nandan | టాలీవుడ్‌లో వారసుల ప్రవేశం అంటే ఎప్పుడూ ప్రత్యేకమైన ఆసక్తి ఉంటుంది. ముఖ్యంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కుమారుడు అకీరా నందన్ వెండితెరపై ఎప్పుడు కనిపిస్తాడా అని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటివరకు అకీరా ఏ సినిమా చేయకపోయినా కూడా, అతనికి ఉన్న అభిమాన వర్గం మాత్రం ఇప్పటికే స్టార్ హీరో స్థాయిలో ఉంది.

  • By: Sandeep |    movies |    Published on : Apr 25, 2026 8:02 AM IST
Akira Nandan | అకీరా ఎంట్రీపై ఆసక్తి పెంచిన అడివి శేష్ వ్యాఖ్యలు… మెగా అభిమానుల్లో జోష్‌

Akira Nandan | టాలీవుడ్‌లో వారసుల ప్రవేశం అంటే ఎప్పుడూ ప్రత్యేకమైన ఆసక్తి ఉంటుంది. ముఖ్యంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కుమారుడు అకీరా నందన్ వెండితెరపై ఎప్పుడు కనిపిస్తాడా అని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటివరకు అకీరా ఏ సినిమా చేయకపోయినా కూడా, అతనికి ఉన్న అభిమాన వర్గం మాత్రం ఇప్పటికే స్టార్ హీరో స్థాయిలో ఉంది.

ఇటీవల నటుడు అడివి శేష్ తన కొత్త సినిమా విజయం సందర్భంగా ఇచ్చిన ఇంటర్వ్యూలలో అకీరా గురించి ఆసక్తికర విషయాలు చెప్పారు. కొంతకాలంగా అకీరా కోసం శేష్ కథ సిద్ధం చేశారని వార్తలు వస్తున్న నేపథ్యంలో, ఈ అంశంపై ఆయన స్పందించారు.

నేను ఎదురు చూస్తున్నాను..

అకీరాతో తనకు మంచి అనుబంధం ఉందని శేష్ తెలిపారు. “అకీరా నాకు చాలా ఇష్టం. మేమిద్దరం అప్పుడప్పుడు కలుస్తుంటాం. మేమిద్దరం ఎడమచేతి వాటం ఉన్నవాళ్లం. ఆ విషయంలో మా మధ్య మంచి అనుసంధానం ఉంది” అని చెప్పారు. అకీరా ఆలోచనా విధానం, వ్యక్తిత్వం చాలా పరిపక్వంగా ఉంటాయని ఆయన అభిప్రాయపడ్డారు.

అకీరా కోసం కథ సిద్ధం చేశారా అన్న ప్రశ్నకు సమాధానమిస్తూ, అతనికి ఇప్పటికే భారీగా అభిమానులు ఉన్నారని, అతని ప్రవేశం కోసం తాను కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని తెలిపారు. అయితే కథపై నేరుగా స్పష్టత ఇవ్వకపోయినా, అకీరా సినీ రంగంలోకి వచ్చిన రోజు పెద్ద సంచలనంగా మారుతుందని అన్నారు.

అకీరా ఎటు వైపు అడుగులు వేస్తారో మ‌రి..

ఇక అకీరా ప్రస్తుతం విదేశాల్లో సంగీతంలో శిక్షణ పొందుతున్నట్లు సమాచారం. తల్లి రేణు దేశాయ్ గతంలో స్పందిస్తూ, అకీరాకు సంగీతంపై ఎక్కువ ఆసక్తి ఉందని, అతని భవిష్యత్తు నిర్ణయాలను పూర్తిగా అతనికే వదిలేశామని చెప్పారు. అలాగే పవన్ కళ్యాణ్ కూడా తన పిల్లల అభిరుచులకు ప్రాధాన్యత ఇస్తున్నారని తెలిసింది.

దీంతో అకీరా నటుడిగా వస్తాడా లేక సంగీత దర్శకుడిగా తన ప్రయాణాన్ని ప్రారంభిస్తాడా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఏ దారిలో వచ్చినా అతని ప్రవేశం మాత్రం టాలీవుడ్‌లో పెద్ద చర్చనీయాంశం కావడం ఖాయం. ప్రస్తుతం అడివి శేష్ చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చకు దారితీస్తున్నాయి.