Dhanush | యాక్ష‌న్ నేను చూసుకుంటా.. డైరెక్ష‌న్ నువ్వు చూసుకో.. డైరెక్ట‌ర్‌పై ధ‌నుష్ స‌రదా పంచ్‌లు

Dhanush | నేషనల్ అవార్డ్ విన్నింగ్ నటుడు ధనుష్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘కర’ విడుదలకు సిద్ధమవుతోంది. ప్రముఖ నిర్మాత డా. ఇషారి కె. గణేష్ నిర్మించిన ఈ సినిమాకు విఘ్నేశ్ రాజా దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో ధనుష్‌కు జోడీగా మమితా బైజు నటించగా, సూరజ్ వెంజారమూడు, కేఎస్ రవి కుమార్ వంటి ప్రముఖులు కీలక పాత్రలు పోషించారు

Dhanush | నేషనల్ అవార్డ్ విన్నింగ్ నటుడు ధనుష్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘కర’ విడుదలకు సిద్ధమవుతోంది. ప్రముఖ నిర్మాత డా. ఇషారి కె. గణేష్ నిర్మించిన ఈ సినిమాకు విఘ్నేశ్ రాజా దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో ధనుష్‌కు జోడీగా మమితా బైజు నటించగా, సూరజ్ వెంజారమూడు, కేఎస్ రవి కుమార్ వంటి ప్రముఖులు కీలక పాత్రలు పోషించారు. ఇప్పటికే షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకున్న ఈ సినిమాను ఏప్రిల్ 30న తమిళంతో పాటు తెలుగులోనూ గ్రాండ్‌గా విడుదల చేయనున్నారు.

ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో నిర్వహించిన తెలుగు ప్రీరిలీజ్ ఈవెంట్‌కు దర్శకుడు వెంకీ అట్లూరి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ధనుష్ మరియు వెంకీ మధ్య జరిగిన సరదా సంభాషణ ప్రేక్షకులను అలరించింది. ఈవెంట్ సందర్భంగా యాంకర్ సుమ కనకాల, “మీరు యాంకర్ అయితే ధనుష్‌ను ఏ ప్రశ్న అడుగుతారు?” అని వెంకీని అడిగారు. దానికి స్పందించిన వెంకీ అట్లూరి, ‘సార్’ సినిమా సమయంలో జరిగిన ఒక ఆసక్తికర సంఘటనను గుర్తుచేశారు.

షూటింగ్ ప్రారంభానికి ముందు మ్యూజిక్ సెషన్స్ జరుగుతున్నప్పుడు ఒక ట్యూన్ విన్న వెంటనే ధనుష్ “లిరిక్స్ నేనే రాస్తాను” అని చెప్పారని తెలిపారు. ఆ తరువాత రోజు రాత్రి షూటింగ్ మధ్యలోనే పిలిచి, కేవలం ఐదు నిమిషాల్లోనే పాట పల్లవి, చరణం రాసేశారని చెప్పారు. ఆ వేగం తనను ఆశ్చర్యానికి గురిచేసిందని వెల్లడించారు.

దేవుడు ఇచ్చిన వ‌రం..

ఈ సందర్భంలో “అంత ఫాస్ట్‌గా లిరిక్స్ ఎలా రాయగలుగుతారు?” అని వెంకీ ప్రశ్నించగా, ధనుష్ సింపుల్‌గా “అది దేవుడు ఇచ్చిన వరం” అని సమాధానమిచ్చారు. దీనికి స్పందించిన వెంకీ, “ధనుష్ మీద దేవుడి ఆశీర్వాదం ఉంది. ఆయన టాలెంట్‌లో 10 శాతం వచ్చినా మేము చాలా దూరం వెళ్తాం” అని కొనియాడారు.

అయితే వెంటనే ధనుష్ సరదాగా స్పందిస్తూ, “నువ్వు వినయంగా నటించకు మ్యాన్… అది నీకు సూట్ కాదు. బ్యాక్ టూ బ్యాక్ బ్లాక్‌బస్టర్లు ఇస్తూ ‘మీరు టాలెంట్ సార్’ అని యాక్ట్ చేస్తున్నావ్. యాక్టింగ్ నేను చూసుకుంటా… నువ్వు డైరెక్షన్ చూసుకో” అంటూ నవ్వులు పూయించారు. దీనికి వెంకీ అట్లూరి కూడా అదే సరదా టోన్‌లో, “నాకు యాక్టింగ్ రాకనే డైరెక్షన్ చేస్తున్నాను సార్” అని సమాధానం ఇచ్చారు. అలాగే ధనుష్ తక్కువ రోజుల్లో సినిమాలు పూర్తి చేసి బ్లాక్‌బస్టర్లు అందించే ప్రతిభను ప్రశంసించారు.

క్రెడిట్ మొత్తం టీమ్‌దే..

ఇక ధనుష్ తన ప్రసంగంలో వినయాన్ని ప్రదర్శిస్తూ, ఒక సినిమా విజయం ఒక్క దర్శకుడి వల్లనే రాదని అన్నారు. “డైరెక్టర్ కెప్టెన్ అయినా, అతనికి టీమ్ అవసరం. నటీనటులు, మ్యూజిక్ డైరెక్టర్, సినిమాటోగ్రాఫర్ ప్రతి ఒక్కరి కృషి సమానంగా ఉంటుంది. ఒక సినిమా తన ఫలితాన్ని తానే నిర్ణయించుకుంటుంది అని బాలు మహేంద్ర గారు ఒకసారి చెప్పారు. కాబట్టి క్రెడిట్ మొత్తం టీమ్‌దే” అని పేర్కొన్నారు. అంతేకాక, “ప్రతి ఒక్కరికీ వారి వారి బలాలు ఉంటాయి. మీరు చేసే పనిని నేను అంత బాగా చేయలేకపోవచ్చు” అని చెప్పి తన వినయాన్ని మరోసారి చాటుకున్నారు.

Latest News