Monalisa | వైరల్ బ్యూటీ మోనాలిసా కేసు కొత్త మలుపు… గర్భవతి వార్తల‌తో మళ్లీ హాట్ టాపిక్!

Monalisa | కుంభమేళాలో పూసలు అమ్ముకుంటూ ఒక్కసారిగా సోషల్ మీడియాలో వైరల్ స్టార్‌గా మారిన మోనాలిసా భోంస్లే జీవితం ప్రస్తుతం సంచలనాలకు కేంద్రబిందువుగా మారింది

Monalisa | కుంభమేళాలో పూసలు అమ్ముకుంటూ ఒక్కసారిగా సోషల్ మీడియాలో వైరల్ స్టార్‌గా మారిన మోనాలిసా భోంస్లే జీవితం ప్రస్తుతం సంచలనాలకు కేంద్రబిందువుగా మారింది. హీరోయిన్‌గా ఇండస్ట్రీలో అడుగుపెడుతున్న సమయంలోనే ప్రేమ వివాహం, ఆపై నమోదైన పోక్సో కేసు… ఇప్పుడు గర్భధారణ వార్తలతో ఈ వ్యవహారం మరో మలుపు తిరిగింది.

వైరల్ నుంచి హీరోయిన్ దాకా

ప్రయాగ్‌రాజ్ కుంభమేళాలో సాధారణ అమ్మాయిగా కనిపించిన మోనాలిసా… సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ కావడంతో ఒక్కసారిగా సెలబ్రిటీగా మారింది. ఆ తర్వాత బాలీవుడ్, టాలీవుడ్ నుంచి అవకాశాలు రావడంతో ఆమె జీవితం పూర్తిగా మారిపోయింది.

ప్రేమ, రహస్య వివాహం

ఈ క్రమంలోనే ఆమె ఫర్మాన్ ఖాన్ అనే వ్యక్తితో ప్రేమలో పడ్డారు. కుటుంబ సభ్యుల అభ్యంతరాల మధ్య, ఇద్దరూ కేరళకు వెళ్లి మార్చి 11న రహస్యంగా వివాహం చేసుకున్నారు. అయితే ఈ నిర్ణయం ఆమె జీవితంలో పెద్ద వివాదాలకు దారితీసింది.

పోక్సో కేసుతో వివాదం

మోనాలిసా మైనర్ అని ఆరోపిస్తూ ఆమె తల్లిదండ్రులు POCSO Act కింద ఫర్మాన్ ఖాన్‌పై కేసు నమోదు చేశారు. ఈ కేసు విచారణలో భాగంగా పోలీసులు మోనాలిసాను హాజరు కావాలని ఆదేశించారు.

అయితే మధ్యప్రదేశ్ పోలీసులతో మాట్లాడిన ఫర్మాన్ ఖాన్… మోనాలిసా ప్రస్తుతం గర్భవతి అని, అందుకే ప్రయాణించలేని పరిస్థితిలో ఉందని చెప్పడం కొత్త చర్చకు దారి తీసింది. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో… నిజమా? లేక కేసు నుంచి తప్పించుకునే ప్రయత్నమా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

నెటిజన్ల సందేహాలు

మార్చి 11న పెళ్లి జరిగి, నెల రోజుల్లోనే గర్భధారణ వార్త రావడం చాలామందిని ఆశ్చర్యానికి గురి చేసింది. “రోజుకో ట్విస్ట్… అసలు నిజం ఏమిటి?” అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

ఈ విషయంలో పోలీసులు కూడా అప్రమత్తమయ్యారు. ఫర్మాన్ ఖాన్ చెప్పిన విషయాలు నిజమా కాదా అన్నది నిర్ధారించేందుకు వైద్య పరీక్షలు నిర్వహించే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.

కేసు గమనం మారే అవకాశం

మోనాలిసా నిజంగా గర్భవతే అయితే… ఈ కేసు దిశ పూర్తిగా మారే అవకాశం ఉంది. ముఖ్యంగా మైనర్ వివాహం చట్టపరంగా చెల్లదనే నేపథ్యంలో, మెడికల్ రిపోర్ట్స్ కీలకంగా మారనున్నాయి.

ఒక సాధారణ అమ్మాయి నుంచి సోషల్ మీడియా స్టార్‌గా ఎదిగిన మోనాలిసా జీవితం ఇప్పుడు వరుస వివాదాలతో నిండిపోయింది. ప్రతి రోజూ కొత్త ట్విస్టులు వస్తుండటంతో… ఈ కేసు ఎటువైపు దారి తీస్తుందో అన్నది ఆసక్తికరంగా మారింది.

Latest News