Prabhas | ప్రభాస్ నటిస్తున్న హారర్–ఫాంటసీ ఎంటర్‌టైనర్ ‘ది రాజా సాబ్’ రోజు రోజుకు ఆసక్తికర అప్డేట్స్‌తో ఫ్యాన్స్‌లో భారీ బజ్‌ని క్రియేట చేస్తుంది. ఇటీవల విడుదలైన ‘రెబెల్ సాబ్’ పాట లాంచింగ్‌కి సంబంధించిన ఈవెంట్‌లో దర్శకుడు మారుతి వెల్లడించిన విషయాలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. విదేశాల్లో గడ్డకట్టే చలిలో కూడా ప్రభాస్ ఒక్కసారి కూడా షూటింగ్ ఆపాలని అనకుండా, పాటల చిత్రీకరణ పూర్తి చేశారని చెప్పారు. “ఇంతకాలం ఫ్యాన్స్ మిస్ అయిన ఎనర్జీని ఈ సినిమా ద్వారా ఇవ్వాలి” అనేది ప్రభాస్ చెప్పిన మాట అని మారుతి తెలిపారు. ప్రభాస్ డెడికేషన్‌కి సెట్‌లో ఉన్నవారు అందరు కూడా ఆశ్చర్యపోయారని సమాచారం.
భారీ స్టార్ కాస్ట్‌తో రూపొందుతున్న ఈ చిత్రాన్ని టీజీ విశ్వప్రసాద్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. పూర్తిస్థాయి కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో రొమాంటిక్ ట్రాక్స్, హైలెట్ అయ్యే ఇంట్రడక్షన్ సాంగ్, మాస్ అవుట్‌పుట్ ఇచ్చే నంబర్స్ అన్నీ ఉండనున్నాయి. ఇందులో ప్రత్యేకంగా ‘రెబెల్ సాబ్’ పాట కోసం 1,000 మంది డ్యాన్సర్లతో చిత్రీకరణ చేయడం ఇప్పుడు పెద్ద చర్చగా మారింది. ఇది ఇటీవల కాలంలో తెలుగు సినిమాల్లో వచ్చిన అతిపెద్ద సాంగ్ సెటప్‌గా నిలిచేలా ఉంది.
ఈ భారీ ప్రాజెక్ట్‌ను ప్రేక్షకులు చూడాలని ఎదురుచూస్తున్న వేళ, మేకర్స్ సినిమా రిలీజ్ డేట్‌ను కూడా క్లారిటీగా ప్రకటించారు. 2026 జనవరి 9న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ సంక్రాంతికి బాక్స్ ఆఫీస్ వద్ద భారీ పోటీ కనిపించనుంది. ఎందుకంటే తలపతి విజయ్ నటించిన ‘జన నాయకన్’ కూడా అదే రోజున థియేటర్లలో అడుగుపెడుతోంది. అయినప్పటికీ ప్రభాస్ టైమ్, ఎనర్జీ, శ్రమ పెట్టి రూపొందించిన ఈ సినిమా ఫ్యాన్స్‌కు బిగ్ ట్రీట్‌గా మారడం ఖాయం. గడ్డకట్టే చలిలో కూడా పాటలపై అద్భుత అవుట్‌పుట్ ఇవ్వడంతో ‘ది రాజా సాబ్’ మీద హైప్ ఆకాశాన్నంటుతోంది. పలు వాయిదాల తర్వాత ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుండడంతో ఈ సినిమా హిట్ గ్యారెంటీ అంటున్నారు.
